![]() |
![]() |

గతేడాది 'రైటర్ పద్మభూషణ్'తో ఘన విజయాన్ని అందుకున్న సుహాస్.. ఈ ఏడాది 'అంబాజీపేట మ్యారేజి బ్యాండు'తో ప్రేక్షకులను పలకరించాడు. ఫిబ్రవరి 2న విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో మంచి వసూళ్లను రాబడుతోంది. త్వరలోనే ఈ సినిమా ఓటీటీలో అలరించడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
ఈమధ్య హిట్-ఫ్లాప్, చిన్న-పెద్ద అనే తేడా లేకుండా దాదాపు సినిమాలన్నీ నాలుగు వారాలకే ఓటీటీలోకి అడుగుపెడుతున్నాయి. ఇదే బాటలో 'అంబాజీపేట మ్యారేజి బ్యాండు' కూడా పయనించనున్నట్లు సమాచారం. ఓటీటీ వేదిక ఆహాలో మార్చి 1 నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుందట. థియేటర్లలో మంచి ఆదరణ పొందుతున్న ఈ సినిమా.. ఓటీటీలో కూడా అదే స్పందన తెచ్చుకుంటుందేమో చూడాలి.
'అంబాజీపేట మ్యారేజి బ్యాండు' చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్, మహాయాన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించాయి. దుశ్యంత్ కటికినేని దర్శకత్వం వహించాడు. శివాని నాగరం హీరోయిన్ గా నటించగా..శరణ్య ప్రదీప్, నితిన్ ప్రసన్న కీ రోల్స్ చేశారు.
![]() |
![]() |