![]() |
![]() |
2023లో విడుదలైన ‘బేబి’ చిత్రం పెద్ద విజయం సాధించిన విషయం తెలసిందే. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ ఆనంద్ ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ సినిమా ఇప్పుడు ఓ వివాదంలో ఇరుక్కుంది. ఆ సినిమా కథ తనదేనంటూ శిరిన్ శ్రీరామ్ అనే వ్యక్తి రాయదుర్గం పోలీసులను ఆశ్రయించాడు. ఈ చిత్రాన్ని సాయిరాజేష్ దర్శకత్వంలో ఎస్.కె.ఎన్. నిర్మించారు. 2013లో డైరెక్టర్ సాయిరాజేష్‌తో తనకు పరిచయం ఏర్పడిరదని, ఆ సమయంలో తన సినిమాకి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేయాలని రాజేష్ కోరాడని, ఆ విధంగా అతనితో తనకు పరిచయం ఏర్పడిరదచి శ్రీరామ్ చెబుతున్నాడు. ఆ సమయంలో ‘బేబి’ స్టోరీ చెప్పానని, దర్శకనిర్మాతలు కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించారని ఆరోపిస్తున్నాడు శ్రీరామ్.
రాయదుర్గం పోలీసుల కథనం ప్రకారం.. 2015లో ‘కన్నా ప్లీజ్’ అనే టైటిల్‌తో శ్రీరామ్ ఒక కథ రాసుకున్నాడు. దాన్ని సినిమాగా తీసే క్రమంలో ‘ప్రేమించొద్దు’ అనే టైటిల్‌ను అనుకున్నారు. సాయిరాజేష్ సూచన మేరకు ఈ కథను నిర్మాత ఎస్‌కెఎన్‌కు శ్రీరామ్ వినిపించాడు. ఇప్పుడదే కథని తీసుకొని ‘బేబి’ అనే టైటిల్‌తో సినిమా తీశారు. ఈ సినిమా కథ మొత్తం ‘ప్రేమించొద్దు’ అనే పేరుతో తను రాసిన కథేనని శ్రీరామ్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈమేరకు రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
![]() |
![]() |