![]() |
![]() |
సినిమాల్లో అవకాశాలు రావడం, వాటిని సద్వినియోగం చేసుకొని నిలదొక్కుకోవడం అనేది అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు. దానికి టాలెంట్‌తోపాటు అదృష్టం కూడా తోడవ్వాలి. అప్పుడే వారు ఆశించిన స్థాయికి వెళతారు. ముఖ్యంగా హీరోయిన్ల విషయానికి వస్తే అందం ఉండాలి, అభినయం ఉండాలి.. దానికితోడు మంచి అవకాశాలు రావాలి. అలా హీరోయిన్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చిన ఎంతో మంది సక్సెస్ అయ్యారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్టు వచ్చిన అవకాశాల్ని వినియోగించుకుంటూ కోట్ల రూపాయలు సంపాదించిన హీరోయిన్లు ఉన్నారు. కానీ, కొందరు మాత్రం వేళ్ళమీద లెక్క పెట్ట గలిగే సినిమాలు మాత్రమే చేసి రిటైర్ అయిన వారు ఉన్నారు.
అలాంటి హీరోయిన్లలో ప్రీతా విజయ్‌కుమార్ ఒకరు. నటుడు విజయ్‌కుమార్, సీనియర్ హీరోయిన్ మంజుల దంపతుల కుమార్తె అయిన ప్రీతా 1997లో ‘రుక్మిణి’ చిత్రంతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో అరడజను సినిమాలతోపాటు తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో మొత్తం 19 సినిమాల్లో నటించింది. 2022లో సినిమాలకు గుడ్ బై చెప్పి అదే సంవత్సరం తమిళ్ డైరెక్టర్ హరిని పెళ్ళి చేసుకుంది. వీరికి ముగ్గురు కుమారులు. చాలా మంది హీరోయిన్లలా సెకండ్ ఇన్నింగ్స్ అంటూ మళ్ళీ ఇండస్ట్రీకే రాకుండా కుటుంబ బాధ్యతలు చూసుకుంటూనే బిజినెస్ రంగంలోకి అడుగు పెట్టింది ప్రీతా.
చెన్నయ్‌లో ప్రీత ప్యాలెస్ పేరుతో కల్యాణ మంటపాన్ని నిర్మించింది. దీనితో పాటు మెట్రో కాఫీ హౌస్ ఏర్పాటు చేశారు. మద్రాస్ కాఫీ పేరుతో ఇప్పటికే పలు ప్రాంచైజీలు కూడా ఇచ్చింది ప్రీత. ఇవి కాక సినిమా రంగానికి ఉపయోగపడే ఎడిటింగ్, డబ్బింగ్ స్టూడియోను కూడా నిర్వహిస్తోంది. ఇలా పలు రంగాల్లో రాణిస్తూ భారీగా ఆదాయాన్ని పొందుతోంది. సినిమా రంగంలో కేవలం 5 సంవత్సరాలు మాత్రమే కొనసాగిన ప్రీత ఇప్పుడు బిజినెస్‌లో బాగా బిజీ అయిపోయి నెలకు లక్షల్లో సంపాదిస్తోంది. అయితే అందరు హీరోయిన్లు ఇలాంటి నిర్ణయాలు తీసుకోలేరు. కొందరు రిటైర్ అయిన తర్వాత భర్త, పిల్లలు అంటూ ఇంటి పట్టునే ఉంటారు. మరికొందరు పిల్లలు కాస్త పెద్దవారైన తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ అంటూ మళ్ళీ ఇండస్ట్రీకే వస్తారు. ఏది ఏమైనా సినిమాలనే నమ్ముకోకుండా తనకు ఎంతో ఇష్టమైన బిజినెస్‌లో రాణిస్తున్న ప్రీతాని మెచ్చుకోవాల్సిందే.
![]() |
![]() |