![]() |
![]() |

ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్ తో కలిసి జంటగా నటించిన బాలివుడ్ నటి ' అలియా భట్'. హిందీలో ఎన్నో హిట్ సినిమాలు చేసిన ఈ భామ.. ప్రస్తుతం ఓ వెబ్ సిరీస్ కి నిర్మాతగా చేస్తోంది.
ప్రస్తుతం ఓటీటీ వేదికలపై కొత్త కంటెంట్ వస్తుంది. వాటిల్లో కొన్ని సినిమాలైతే మరికొన్ని వెబ్ సిరీస్ లు.. వీటిల్లో ఎక్కవగా ఒక భాషలో సినిమా చేసి తమిళ్, మలయాళం, తెలుగు, ఇంగ్లీష్, హిందీ, కన్నడ భాషలలో రిలీజ్ చేస్తున్నారు. కొంతమంది డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు ఫర్జీ, ఫ్యామిలీ మ్యాన్ లాంటి హిందీ సిరీస్ లని అన్ని భాషలలో విడుదల చేసి హిట్లు సొంతం చేసుకున్నారు. ఇప్పుడు అలియా భట్ ' పోచర్ ' అనే సిరీస్ కి అమేజాన్ ప్రైమ్ వీడియోతో కలిసి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా చేస్తోంది. ఈ వెబ్ సిరీస్ ని ' ఎమ్మీ'. అవార్డు విన్నర్, దర్శకుడు రిచీ మెహతా రూపొందించారు. ఇప్పటికే ఈ సిరీస్ షూటింగ్ పూర్తయింది. దాంతో ఈ వెబ్ సిరీస్ ని ఫిబ్రవరి 23 వ తేదీ నుండి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేస్తున్నట్టు ఆ అనుబంధ సంస్థ సోషల్ మీడియాలో పేర్కొంది.
ఈ వెబ్ సిరీస్ లో నిమేషా సజయన్, రోషన్ మాథ్యూ కీలక పాత్రలు పోషిస్తున్నారు. క్రైమ్ సిరీస్ గా తెరకెక్కిన ఈ సిరీస్.. ఓ ఏనుగుతో పాటు పక్కన ముగ్గరు పోలీసు అధికారులతో పోస్టర్ ఆసక్తిని రేకెత్తించేలా ఉంది. ఈ సిరీస్ గురించి అలియా భట్ మాట్లాడుతూ.. ఒక అద్భుతమైన ప్రాజెక్టులో భాగస్వామిని అయినందుకు సంతోషంగా ఉంది. ఈ భూమ్మీద జీవించే అన్ని జీవరాశులపై ప్రేమ, కరుణ, జాలి ఉండాలనే బలమైన సందేశాన్ని ఈ ' పోచర్ ' ఇస్తుందని నమ్ముతున్నాను. అంతేకాదు ' పోచర్ ' ఎంతోమంది కళ్ళు తెరిపిస్తుందని అలియా అంది. ఈ క్రైమ్ ఎలిమెంట్స్ తో ఉండే సిరీస్ కథేంటో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
![]() |
![]() |