![]() |
![]() |

సినిమా నటుల జీవితాలు కూడా ఒక్కోసారి సినిమాలాగానే నాటకీయంగా ముగిసిపోతాయి.ఒక్కోసారి వాళ్ళ జీవితం కంటే సినిమానే నయం అని కూడా అనిపిస్తుంది. ఇప్పుడు తాజాగా ఒక సినిమా నటి విషయంలో జరిగిన సంఘటన ఒకటి పలువురి హృదయాల్ని కలిచివేస్తుంది.
ప్రముఖ తమిళ నటి కాసమ్మాళ్ ఇటీవలే హత్యకి గురయ్యింది. ఆమె కన్నకొడుకు అయిన నామకోడి ఆ దారుణానికి పాల్పడ్డాడు. మద్యానికి బానిసయ్యిన నామకోడి తరచు కాసమ్మాళ్ ని డబ్బుల కోసం వేధిస్తూ ఉండేవాడు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య వాగ్వివాదం చోటు చేసుకోవడంతో ఒక పొడవాటి చెక్కతో నామకోడి కాసమ్మాళ్ ని పొడవడంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. నామకోడి గత పదిహేను ఏళ్లుగా తన తల్లి వద్దే ఉంటున్నాడు. అతనికి భార్య పిల్లలు కూడా ఉన్నారు. ఈ ఘటన మదురై సమీపంలోని అనయ్యుర్ లోని కాసమ్మాళ్ స్వగృహంలో చోటు చేసుకుంది.
2022 లో విజయ్ సేతుపతి హీరోగా వచ్చిన కడేసి వివాహాయి మూవీలో కాసమ్మాళ్ నటించింది. ఆ మూవీలో విజయ్ సేతుపతి తల్లిగా ఆమె నటన అందర్నీ ఆకట్టుకుంది. కి నేషనల్ అవార్డు ని కూడా కడేసి వివాహాయి గెలుచుకుంది.పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
![]() |
![]() |