![]() |
![]() |

టాలీవుడ్ లో మణిశర్మకి ఉన్న క్రేజ్ అలాంటిలాంటిది కాదు. గత 30 ఏళ్లుగా ఆయన కంపొజిషన్ లో ఎన్నో అద్భుతమైన పాటలు ఆడియన్స్ ని అలరించాయి... ఇప్పటికీ అలరిస్తున్నాయి. ఆయనతో పనిచేసిన బాలకృష్ణ, పూరీ జగన్నాథ్, చంద్రబోస్, గుణశేఖర్, రాజమౌళి, రామజోగయ్య శాస్త్రి వంటి ఎంతో మంది ఆయన గురించి అద్భుతంగా మాట్లాడారు. ఈ వారం "సూపర్ సింగర్" షో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో మణిశర్మ కంపొజిషన్ లో ఉన్న సాంగ్స్ ని పాడారు కంటెస్టెంట్స్.
ఇక తాను ఫస్ట్ నేర్చుకున్న ఇన్స్ట్రుమెంట్ వయోలిన్ అని కానీ అది కాస్త చిన్నగా ఉందని పెద్ద కీబోర్డ్ ఉంటే అది బాగుంటుంది అని అనిపించి దాని మీద ట్రై చేశానన్నారు మణిశర్మ. ఇక ఆ టైములో ఇండియాలో హయ్యెస్ట్ పెయిడ్ కీబోర్డ్ ప్లేయర్ మణిశర్మనే. ఇక అనంత శ్రీరామ్ మణిశర్మని ఒక ప్రశ్న అడిగారు. "ఎక్కువగా రిథమ్ ప్రోగ్రామింగ్ చేస్తున్న వాళ్ళ దగ్గరకెళ్ళి మీకు నచ్చకపోతే స్పీకర్లు పగులగొట్టిన సందర్భాలు ఉన్నాయా" అని అడిగేసరికి " దానికి మణిశర్మ ఇలా అన్నారు. " అది ఆ తమన్ గాడు అబద్దం చెప్పి ఉంటాడు" అనేసరికి "అంటే మీ జీవితంలో స్పీకర్లే పగలగొట్టలేదా" అని అడిగేసరికి " ఒకసారి పగలకొట్టాలే కానీ" అని చెప్తూ నవ్వేశారు మణిశర్మ. తర్వాత ఒక కంటెస్టెంట్ ఇలా అడిగింది "మీరు సాంగ్ కంపోజ్ చేసేటప్పుడు మీ ఓన్ సాంగ్ కి మీరు డాన్స్ చేస్తూ కంపోజ్ చేస్తారట నిజమేనా" అని అడిగింది "ఆమ్మో అదేం లేదు ..ఆడించడమే తప్ప ఆడడం అస్సలు రాదు" అని సిగ్గుపడుతూ చెప్పారు మణిశర్మ. తర్వాత శ్రీముఖి మణిశర్మతో డాన్స్ చేయిచింది. అలాగే పవన్ కళ్యాణ్ గురించి కూడా కొన్ని విషయాలు చెప్పారు. మూవీ షూటింగ్ కి టైంకి వస్తారు అలాగే బీట్ చెప్తే డాన్స్ చేస్తారు..లేదంటే ఒక మూల కూర్చుకుని బుక్స్ చదువుకుంటూ ఉంటారన్నారు. ఇండస్ట్రీలో 30 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మణిశర్మను టీమ్ మొత్తం సన్మానించారు.
![]() |
![]() |