![]() |
![]() |

నాచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన గ్యాంగ్ లీడర్ మూవీతో తెలుగు తెరకి ఎంట్రీ ఇచ్చిన నటి ప్రియాంక మోహన్. మొదటి సినిమాతోనే ప్రేక్షకులని తన అందంతో నటనతో మైమరిపింపచేసిన ఆమె మొదటి నుంచి కూడా ఏ సినిమా పడితే ఆ సినిమా చెయ్యదు. రాశి కంటే వాసి ప్రధానమని నమ్మే ప్రియాంక నటనకి అవకాశం ఉన్న సినిమాలనే చేసుకుంటు వెళ్తుంది. తాజాగా ఒక విషయంలో ఆమె తన ఆనందాన్ని తెలియచేసింది
ప్రియాంక రీసెంట్ గా ధనుష్ హీరోగా వచ్చిన కెప్టెన్ మిల్లర్ లో నటించింది.ఆ మూవీలో రెగ్యులర్ హీరోయిన్ గా కాకుండా భానుమతి అనే డి గ్లామరైజ్ పాత్రలో ఆమె నటించింది. ఇప్పుడు ఆమె నటనకి అందరినుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ సందర్భంగా ఆమె ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతు మా అమ్మ నాన్న కెప్టెన్ మిల్లర్ లోని నా పాత్ర చూసి చాలా మెచ్చుకున్నారని ఈ విషయం తన జీవితాంతం గుర్తుంటుందని చెప్పింది.

అలాగే ఆ సినిమాకి ముందు దర్శకుడు అరుణ్ మాతేశ్వరన్ తన క్యారక్టర్ గురించి ఏం చెప్పాడో అదే తెరకెక్కించాడని చెప్పింది. అంతే కాకుండా ధనుష్ లాంటి ఆర్టిస్ట్ ల సరసన నటించడం వల్ల నటనకి సంబంధించిన చాలా విషయాలని నేర్చుకోవచ్చని కూడా ఆమె చెప్పింది. సంక్రాంతికి తమిళనాడులో విడుదలైన కెప్టెన్ మిల్లర్ రిపబ్లిక్ డే కానుకగా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
![]() |
![]() |