![]() |
![]() |

కింగ్ అక్కినేని నాగార్జున నుంచి ఈ సంక్రాంతి కి వచ్చి విజయపథాన దూసుకెళ్తున్న మూవీ నా సామి రంగా (naa saami ranga)తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ ని పొంది ప్రపంచ వ్యాప్తంగా మంచి వసూళ్లనే సాధిస్తుంది. ఈ మూవీ నిన్నటితో ఎనిమిదిరోజులని కంప్లీట్ చేసుకోవడంతో మొన్న ఆ మధ్య నాగార్జున చెప్పిన ఒక విషయం ఇప్పుడు సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తుంది.
నా సామి రంగ ఎనిమిది రోజులకి గాను వరల్డ్ వైడ్ గా 44 8 కోట్ల రూపాయిల గ్రాస్ ని సాధించింది. దీంతో నాగార్జున కెరీర్ లోనే ఒన్ ఆఫ్ ది హయ్యెస్ట్ గ్రాసర్ సాధించిన మూవీగా నా సామి రంగ నిలిచింది . నైజాంలో 4.68 కోట్లు సీడెడ్‌లో 3.52 కోట్లు ఉత్తరాంధ్రలో 3.21 ఈస్ట్ గోదావరి 2.52 వెస్ట్ 1.21 గుంటూరు 1.39 కృష్ణా 1.18 నెల్లూరు 82 లక్షలు ఇలా 18.53 కోట్లు షేర్ తో టోటల్ గా 30.45 కోట్లు గ్రాస్ ని సాధించింది. అలాగే కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో 70 లక్షలు, ఓవర్సీస్లో 55 లక్షలు వసూలు చేసింది. ఇలా మొత్తం కలుపుకుంటే 19.78 కోట్లు షేర్‌తో 44.8 కోట్లు గ్రాస్ ని నా సామి రంగ సాధించింది.
నా సామి రంగ తో మంచి హిట్ స్కోర్ సాధిస్తానని నాగ్ మూవీ రిలీజ్ కి ముందే చెప్పాడు. ఇప్పుడు ఇచ్చిన మాట నిలబెట్టుకొని తన కెరీర్ లోనే నెంబర్ వన్ కలెక్షన్స్ ని సాధించి నాగ్ ది గ్రేట్ అని అనిపించుకున్నాడు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పై నిర్మాణం జరుపుకున్న నా సామి రంగ లో నాగ్ అండ్ ఆషికా రంగనాధ్ (ashika ranganath)ల మధ్య ఉన్న స్వచ్ఛమైన ప్రేమ ప్రతి ఒక్కరిని విపరీతంగా ఆకట్టుకుంటుంది. అలాగే అల్లరి నరేష్, రాజ్ తరుణ్ ల మధ్య వచ్చే సన్నివేశాలు కూడా ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. కీరవాణి (keeravani)మ్యూజిక్ అండ్ చంద్రబోస్ (chandrabose) సాహిత్యానికి కూడా ప్రేక్షకుల దృష్టిలో మంచి మార్కులు పడుతున్నాయి.
![]() |
![]() |