![]() |
![]() |
సంక్రాంతి కానుకగా విడుదలైన ‘హనుమాన్’ కలెక్షన్లపరంగా తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. మొదటివారం బాక్సాఫీస్‌ని గడగడలాడిరచిన హనుమాన్ రెండో వారంలోకి ప్రవేశించింది. 7వ రోజుకన్నా 8వ రోజు అన్ని ఏరియాల్లో అద్భుతమైన కలెక్షన్లు రాబట్టింది. చాలా చోట్ల థియేటర్లు పెరగడం ఈ సినిమా స్టామినాను మరోసారి గుర్తు చేస్తోంది. ఈ సినిమాపై ఆడియన్స్‌లో ఆసక్తి రోజురోజుకీ పెరుగుతోంది. దీంతో థియేటర్లలో సినిమా చూసే ప్రేక్షకుల సంఖ్య బాగా పెరిగింది. 8వ రోజు రూ.4.73 షేర్ సాధించగా, వరల్డ్‌వైడ్‌గా రూ. 7.70 కోట్ల షేర్‌ను సొంతం చేసుకుంది. ఇక గ్రాస్ విషయానికి వస్తే వరల్డ్‌వైడ్‌గా రూ.14.25 కోట్లు కలెక్ట్ చేసింది.
ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.30.50 కోట్లు కాగా, ఇప్పటివరకు సాధించిన ప్రాఫిట్ రూ.53.89 కోట్లుగా నమోదవుతోంది. ఇప్పటికే బ్లాక్‌బస్టర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకున్న ఈ సినిమా వీకెండ్‌లో తన జోరును మరింత పెంచేందుకు సిద్ధమవుతోంది. ఒక ఏరియా అని కాకుండా రిలీజ్ అయిన ప్రతిచోటా తన విజయబావుటాను ఎగురవేస్తోంది హనుమాన్.
![]() |
![]() |