![]() |
![]() |

సంక్రాంతి పండగ వస్తే చాలు పెద్దా చిన్నా అనే తేడా లేకుండా ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే తమ సొంత గ్రామానికో లేక ఏదైనా టూర్ ప్లాన్ చేసుకోవడం లాంటిదో చేస్తుంటారు. ఈ విషయంలో సినీ సెలబ్రిటీస్ ఏమి అతీతులు కాదు. వాళ్ళు కూడా సంక్రాంతిని ఎంజాయ్ చెయ్యడానికి వాళ్ళకి నచ్చిన ప్రదేశానికి వెళ్తుంటారు.ఇప్పుడు ఈ విషయంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ (ram charan)కి సంబంధించిన న్యూస్ ఒకటి వైరల్ గా మారింది.
రామ్ చరణ్ తన సతీమణి ఉపాసన (upasana)కూతురు క్లిన్ కార(klin kaara) తో కలిసి సంక్రాంతి సెలెబ్రేషన్స్ ని బెంగుళూర్ లో జరుపుకోబోతున్నాడు. ఈ మేరకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి చరణ్ తన ఫ్యామిలీతో కలిసి బెంగళూరు బయలుదేరుతున్న పిక్స్ ని కెమెరా క్లిక్ మనిపించింది. అంతే కాకుండా చరణ్ తో పాటు పవన్ కళ్యాణ్(pawan kalyan)కొడుకు అఖీరా నందన్, ఆధ్య లు కూడా బెంగళూరు బయలుదేరి వెళ్లారు.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పిక్స్ తో పాటు వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రామ్ చరణ్ తనతో పాటు అఖీరా, అధ్యలని కూడా తీసుకెళ్లడంతో మెగా ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. అలాగే చరణ్ ప్రస్తుతం చేస్తున్న గేమ్ చేంజర్ మూవీ కోసం కూడా మెగా ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.
![]() |
![]() |