Home

»

Latest News

గుర్తుంచుకొని మరీ బాలీవుడ్ టాప్ హీరోయిన్ గురించి ట్వీట్ చేసిన ప్రభాస్

Jan 6, 2024 11:07AM

సలార్ ( salaar)తో తనని  పాన్ ఇండియా స్టార్ అని ఎందుకంటారో ప్రభాస్ ( prabhas)మరోసారి  ఇండియన్ చిత్ర పరిశ్రమకి చాటి చెప్పాడు.సలార్ తో ఇప్పటికి  650 కోట్లకి పైగా రాబట్టిన ప్రభాస్  సరికొత్త రికార్డులు సృష్టించే దిశగా  ముందుకు వెళ్తున్నాడు. తాజాగా ప్రభాస్ చేసిన ట్వీట్ ఒకటి హాట్ టాపిక్ అయ్యింది.

నిన్న  ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా పదుకొనే( deepika padukone)పుట్టిన రోజు.. ఈ సందర్భంగా ప్రభాస్ తన ట్విటర్ లో  ఆమె ఫోటోని షేర్ చేస్తు అందమైన నటికి పుట్టిన రోజు శుభాకాంక్షలు మీలాగే ఈ సంవత్సరం మరింత అందంగా ఉండాలని కోరుకుంటున్నాను అనే క్యాప్షన్ ని కూడా జత  చేస్తు దీపికాకి బర్త్ డే విషెస్ చెప్పాడు. ఇప్పుడు ప్రభాస్ చేసిన ఈ ట్వీట్ ఇండియన్ ఫిలిం సర్కిల్స్ లో సంచలనం సృష్టిస్తుంది.

ప్రభాస్ ,దీపికా పదుకునే లు కలిసి  కల్కి 2898 ఏడి ( kalki 2989 ad) మూవీలో చేస్తున్నారు. నాగ్ అశ్విన్ ( nag ashwin) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ కోసం పాన్ ఇండియా వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇటీవలే దర్శకుడు నాగ్ అశ్విన్ కల్కి సినిమా ఎలా ఉండబోతుందో కూడా  చెప్పడంతో భారతీయ చిత్ర పరిశ్రమలో కల్కి 2898  ఏ.డి  సరికొత్త ట్రెండ్ క్రియేట్ చెయ్యడం ఖాయమని అందరు ఫిక్స్ అయ్యారు.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com