![]() |
![]() |
.webp)
నాచురల్ స్టార్ నాని (nani) హీరోగా గత నెల డిసెంబర్ 7 న వచ్చి సంచలన విజయం సాధించిన మూవీ హాయ్ నాన్న.ఈ మధ్య కాలంలో ఇంటిల్లాపాది కలిసి చూడగలిగిన సినిమాగా పేరు సంపాదించిన సినిమా ఏదైనా ఉంది అంటే ఆ మూవీ హాయ్ నాన్ననే అని కూడ చెప్పవచ్చు. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరు హాయ్ నాన్న ని ఆదరించారు.ఈ మూవీలో నానికి వైఫ్ గా మృణాల్ ఠాకూర్ (mrunal thakur) కూతురు గా కియారా ఖన్నా లు నటించారు. ఇప్పుడు హాయ్ నాన్నకి సంబంధించిన తాజా న్యూస్ సినీ అభిమానుల్లో ఫుల్ జోష్ ని తెచ్చింది.
హాయ్ నాన్న ( Hi Nanna) మూవీ ఈ రోజు నుంచి ఓటిటి లో ప్రసారం కాబోతుంది. ప్రముఖ దిగ్గజ సంస్థ నెట్ ఫ్లిక్స్ ద్వారా హాయ్ నాన్న మరింతగా పేక్షకులని ఆకట్టుకోవడానికి రెడీ అయ్యింది. ఇప్పుడు ఈ వార్తతో నాని అభిమానులు,మూవీ లవర్స్ ఎంతో ఆనందంలో ఉన్నారు. అలాగే హాయ్ నాన్న ని వీక్షించడానికి రెడీ అయిపోయారు.ఆల్రెడీ థియేటర్స్ లో మంచి కలెక్షన్స్ తో రన్ అవుతున్న హాయ్ నాన్న ప్రేక్షకులకి మరింత దగ్గరవ్వడం కోసమే ఓటిటి లో ప్రత్యక్ష మవుతుంది.

హాయ్ నాన్నలో విరాజ్, యష్ణ క్యారెక్టర్స్ లో నాని, మృణాల్ పోటాపోటీగా నటించారు. అలాగే వీరిద్దరి కూతురుగా మహి క్యారక్టర్ లో కియారా నటన కూడా మన అందర్నీ ఎంతగానో కట్టిపడేస్తుంది. పుట్టుకతోనే ఒక అరుదైన వ్యాధితో పుట్టిన ఒక పాప మీద ఆమె తండ్రికి ఉన్న ప్రేమ ఆ పాప రోగాన్ని ఎలా జయించిందో అని చెప్పడంతో పాటుగా స్వచ్ఛమైన ప్రేమ తన గతాన్ని మర్చిపోయినా కూడా మళ్ళీ ఫ్రెష్ గా మన దగ్గరికే వచ్చి చేరుతుంది అనే పాయింట్స్ తో తెరకెక్కిన హాయ్ నాన్న ని మిస్ అవకుండా చూడండి. నూతన దర్శకుడు శౌర్యవ్ దర్శకత్వం వహించగా చెరుకూరి మోహన్, విజేందర్ రెడ్డి,మూర్తి లు నిర్మించారు
![]() |
![]() |