Home

»

Latest News

తేజ సజ్జ కి మహిమ గల ఉంగరాన్ని ఇచ్చిన ది కాశ్మీరీ ఫైల్స్ నిర్మాత

Jan 4, 2024 9:35AM

హనుమాన్.. హను మాన్.. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ఇదే నామ జపం. తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన హనుమాన్ సంక్రాంతి కానుకగా ఈ నెల 12 న వరల్డ్ వైడ్ గా  విడుదల కానుంది. తాజాగా ఈ మూవీ హీరో తేజ కి ఒక ప్రొడ్యూసర్ గిఫ్ట్ ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

పాన్ ఇండియా లెవల్లో సినిమాలు నిర్మించే అభిషేక్ అగర్వాల్ తాజాగా హనుమాన్ హీరో తేజ సజ్జకి ఒక అత్యంత పవిత్రమైన బంగారు ఉంగరాన్ని బహూకరించాడు. ఇంతవరకు ఒక నిర్మాత తన సినిమాకి సంబంధించిన హీరో కి కాకుండా వేరే హీరోకి అతని సినిమా రిలీజ్ కి ముందు  గిఫ్ట్ ఇచ్చిన  దాఖలాలు లేవు. అలాంటిది ఇప్పుడు  హనుమాన్ రిలీజ్ కి ముందు  తేజ సజ్జ కి అభిషేక్ గిఫ్ట్ ఇవ్వడం ప్రాధాన్యతని సంతరించుకుంది. అభిషేక్ ఇటీవలే టైగర్ నాగేశ్వరరావు సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు.అలాగే ది కాశ్మీరీ ఫైల్స్ మూవీకి కూడా అభిషేక్ సహ నిర్మాతగా వ్యవహరించాడు

హనుమాన్ లో తేజ సజ్జ సరసన  అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించగా వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్,దీపక్ శెట్టి, వెన్నెల కిషోర్, సత్య తదితరులు నటించగా నిరంజన్ రెడ్డి నిర్మాణ సారథ్యంలో హనుమాన్ తెరకెక్కింది.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com