![]() |
![]() |

సినీ పరిశ్రమలో కొంతకాలంగా రగులుతున్న లైంగిగ వేధింపుల వ్యవహారం ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. సింగర్ చిన్మయి ఈ విషయంలో ఎక్కువగా పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. సందర్భం వచ్చినప్పుడల్లా తనదైన శైలిలో లైంగిక వేధింపులపై గళమెత్తే చిన్మయి మరోసారి రచయిత వైరముత్తుపై విరుచుపడిరది. తనని లైంగికంగా వేధించిన వైరముత్తుకు పవర్‌ఫుల్ పర్సన్ మద్దతు ఉండడం ఆమెకు నచ్చలేదు. అతనికి సపోర్ట్‌గా ఉన్న కమల్‌హాసన్, పి.చిదంబరం, తమిళనాడు సీఎం స్టాలిన్ తీరుపై ఆమె మండిపడుతోంది. చిన్మయి తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు పెద్ద చర్చనీయాంశంగా మారింది.
తమిళ రచయిత వైరముత్తు రాసిన ‘మహా కవితై’ పుస్తకావిష్కరణ కార్యక్రమం ఇటీవల చెన్నయ్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి తమిళనాడుసీఎం స్టాలిన్, సీనియర్ నాయకుడు పి.చిదంబరం, హీరో కమల్‌హాసన్ హాజరయ్యారు. తనని లైంగికంగా వేధించి తన కెరీర్ నాశనమవ్వడానికి కారకుడైన వైరముత్తుకి తమిళనాడులోని అత్యున్నత స్థానంలో ఉన్న వారు మద్దతునిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. తనకి న్యాయం ఎప్పుడు జరుగుతుందో అంటూ ట్వీట్ చేసింది. దాదాపు ఐదేళ్ళుగా తన గోడును చెబుతూనే ఉంది చిన్మయి. అయితే ఈ విషయంలో వైరముత్తుపై ఎలాంటి చర్య తీసుకోకుండా చిన్మయిపై నిషేధాన్ని విధించింది తమిళ చిత్ర పరిశ్రమ. అయితే ఇటీవల ఆ నిషేధాన్ని ఎత్తివేశారు.
![]() |
![]() |