![]() |
![]() |

సూపర్ స్టార్ మహేష్ బాబు... తెలుగు సినిమా పరిశ్రమలో ఎన్నో సరికొత్త రికార్డు లు సృష్టించిన టాప్ స్టార్. లేటెస్ట్ గా ఆయన నుంచి వస్తున్న మూవీ గుంటూరు కారం. సుమారు సంవత్సరం తర్వాత మహేష్ నుంచి సినిమా వస్తుండటంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవు. జనవరి 12 న విడుదల అవుతున్న గుంటూరు కారం ఓవర్సీస్ లో మాత్రం 11 నే విడుదల అవుతుండటంతో మహేష్ కి సంబంధించిన ఒక న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతుంది.
మహేష్ కి ఓవర్సీస్ లో అదిరిపోయే రికార్డు ఉంది. మహేష్ నటించిన 11 సినిమాలు యూఎస్ లో మిలియన్ డాలర్ కలెక్షన్స్ ని వసూలు చేసాయి. ఈ రికార్డు ఇప్పటివరకు ఏ హీరోకి లేదు. ఇప్పుడు గుంటూరు కారం అడ్వాన్స్ బుకింగ్ ఓవర్సీస్ లో స్టార్ట్ అయ్యి హై స్పీడ్ గా బుక్ అవుతుండటంతో మహేష్ మరో అడుగు ముందుకు వేయబోతున్నాడు. యూఎస్ లో గుంటూరు కారం టాక్ తో సంబంధం లేకుండా 1 మిలియన్ మార్క్ అందుకుంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. దీంతో మహేష్ నటించిన 12 సినిమాలు యూఎస్ లో 1 మిలియన్ మార్క్ అందుకున్నట్లు అవుతుంది.
కాగా మహేష్ గుంటూరు కారం సినిమాని పూర్తి చేసి న్యూ ఇయర్ వేడుకలలో భాగంగా విదేశాలకి వెళ్ళాడు. త్వరలోనే ఆయన ఇండియాలో అడుగుపెట్టబోతున్నాడు. ఆ తర్వాత గుంటూరు కారం ప్రమోషన్స్ భారీ ఎత్తున ప్రారంభం కానున్నాయి. అందులో భాగంగా జనవరి 6 న ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ట్రైలర్ కూడా ఆరోజే రిలీజ్ అవుతుండటంతో ఇక గుంటూరు కారం గురించే అందరు మాట్లాడుకోవడం ప్రారంభం కాబోతుందని మహేష్ ఫ్యాన్స్ భావిస్తున్నారు.
![]() |
![]() |