![]() |
![]() |

బిగ్ బాస్ కి ఎంత పేరుందో అందులో కంటెస్టెంట్ గా చేసిన కౌశల్ మందా కూడా అంతే ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించాడు. బిగ్ బాస్ తర్వాత కనిపించకుండా పోయిన కౌశల్ మంద ఓ పాన్ ఇండియా మూవీలో నటిస్తున్న విషయం మీడియా ముందుకు వచ్చి చెప్పారు. కౌశల్ మందకి అప్పట్లో కౌశల్ ఆర్మీ తయారై అతన్ని గెలిపించారు. ఇక కౌశల్ ఎక్కడుంటే అక్కడ కాంట్రవర్సీలు కూడా వెంటే ఉంటాయి. అలా అప్పట్లో వార్తల్లో నిలిచాడు కౌశల్. సోషల్ మీడియాలో రీల్స్, వీడియోస్ చేస్తూ యాక్టివ్ గా ఉన్నాడు. ఒక ఇంటర్వ్యూలో కౌశల్ మాట్లాడుతూ... తన కొత్త సినిమా గురించి డీటెయిల్స్ చెప్పాడు. తాను ఒక పెద్ద పాన్ ఇండియా సినిమా చేస్తున్నానని అది కూడా రూ. 250 కోట్లు బడ్జెట్ మూవీ అని చెప్పి షాక్ ఇచ్చాడు. ఆ మూవీ డీటెయిల్స్ త్వరలో చెప్తానని కూడా చెప్పాడు. అలాగే ఈ మూవీకి ముందు "రైట్" అనే మూవీ చేసినట్లు చెప్పాడు.
ఈ మూవీ మలయాళంలో వచ్చిన "మెమోరీస్" అనే మూవీకి రీమేక్ అని చెప్పాడు. మలయాళంలో హీరోగా చేసిన పృద్విరాజ్ రోల్ లో తెలుగులో కౌశల్ నటించినట్లు చెప్పాడు. అలాగే తాను ఎంఎల్ ఏగా పోటీ చేయాలంటూ రకరకాల పార్టీల నుంచి ఆఫర్స్ కూడా వచ్చాయంటూ కౌశల్ చెప్పాడు. ఎందుకంటే స్కూల్ ఏజ్ లో అన్ని క్లాసెస్ లో లీడర్ గా కాలేజీలో ప్రెసిడెంట్ చేసి ఉన్న ఎక్స్పీరియెన్స్ ఉంది కాబట్టి లీడర్ షిప్ క్వాలిటీస్ తనలో ఎక్కువగా ఉండడంతో పోటీ చేయాలనుకున్నట్లు చెప్పాడు. కానీ ఫైనాన్షియల్ గా తనకు అంత కాపబుల్ కాదు కాబట్టి ఆ నిర్ణయం నుంచి విరమించుకున్నట్టు చెప్పాడు. ఇక తన సీజన్ లో బాబు గోగినేనితో తప్ప మిగతా వారందరితో ఫోన్ లో టచ్ లో ఉన్నట్టు చెప్పాడు. ఫేమ్ ఉన్నా లేకపోయినా తాను పట్టించుకోనని దాని మీద డిపెండ్ కానని చెప్పాడు ఎందుకంటే తనకు ఆల్రెడీ ఒక ప్రొడక్షన్ హౌస్ తో పాటు మోడలింగ్ ఏజెన్సీ ఉందని ఈ ఏజెన్సీ ద్వారా రోజుకు కొంతమందికి మోడలింగ్ నేర్పిస్తానని చెప్పారు. మిగతా టైములో యాడ్ ఫిలిమ్స్ యాక్ట్ చేయడంతో పాటు, డైరెక్ట్ కూడా చేస్తానని అలాగే ఈవెంట్స్ కండక్ట్ చేస్తూ ఉంటానని చెప్పాడు కౌశల్.
![]() |
![]() |