![]() |
![]() |

తమిళ స్టార్ కమెడియన్ యోగిబాబు తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. డబ్బింగ్ సినిమాలతో తెలుగు ఆడియన్స్ కి బాగానే చేరువయ్యాడు. కానీ యోగిబాబు ఇంతవరకు ప్రోపర్ తెలుగు సినిమా చేయలేదు. అయితే త్వరలోనే ఆయన ఓ స్టార్ హీరో సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ మారుతి కాంబినేషన్ లో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ మూవీ అధికారిక ప్రకటన కూడా రాకుండానే షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాలో యోగిబాబు కూడా నటిస్తున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తెలియజేశాడు.
మారుతి సినిమాల్లో మామూలుగానే కామెడీ హైలైట్ గా నిలుస్తుంటుంది. అలాంటిది ఇప్పుడు యోగిబాబు వంటి స్టార్ కమెడియన్ ని రంగంలోకి దింపడం చూస్తుంటే.. కామెడీ అదిరిపోతుంది అనడంలో సందేహం లేదు.
![]() |
![]() |