![]() |

నితిన్ తాజాగా ఎక్స్‌ట్రా ఆర్డినరీ మేన్ తో థియేటర్స్ లో కి అడుగుపెట్టాడు. ఫుల్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఆ మూవీ పాజిటివ్ టాక్ తో ముందుకు దూసుకుపోతుంది. అలాగే విడుదలైన అన్ని చోట్ల నితిన్ కెరీర్లోనే మంచి ఓపెనింగ్స్ ని సాధించిన సినిమాగా కుడా నిలిచింది. తాజాగా ఆ మూవీలో విజయ్ దేవరకొండ, రష్మిక ల మీద నితిన్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి.
ఎక్స్‌ట్రా ఆర్డినరీ మేన్ లో నితిన్ సినిమాల్లో నటించే జూనియర్ ఆర్టిస్ట్ క్యారక్టర్ ని పోషించాడు. ఈ మూవీలో వచ్చే ఒక సీన్ లో హీరోయిన్ శ్రీలీల ఇంటికి నితిన్ వెళ్తాడు. నితిన్ సినిమాల్లో చేస్తుంటాడనే విషయం తెలుసుకున్న శ్రీలీల కుటుంబ సభ్యులు నితిన్ తో విజయ్ , రష్మిక ల రిలేషన్ గురించి అడుగుతారు. అప్పుడు నితిన్ అల్లు అర్జున్ హీరోగా వచ్చిన జులాయి సినిమాలోని టైటిల్ సాంగ్ అయిన నేనెట్ట గుంటే నీకేటి అన్నాయ్ నేను పక్కా జులాయి అయితే నీకేటి అన్నాయ్ అనే పాట పాడతాడు. అంతే ఒక్కసారిగా అందరు థియేటర్ లో నవ్వులు స్టార్ చేసారు.

ఎక్స్‌ట్రా ఆర్డినరీ మేన్ దర్శకుడు విజయ్ రష్మిక ల లవ్ గురించి జులాయి పాట ద్వారా చెప్పించడంతో ఎవరు ఎలా పోతే మనకేంటి మన పని మనం చూసుకుందాం అని చెప్పాడని అందరు అంటున్నారు. అలాగే విజయ్ దేవరకొండ, రష్మిక ల లవ్ గురించి ఎప్పటినుంచో రకరకాల పుకార్లు వచ్చాయి.వాళ్లిదరు లవ్ లో ఉన్నారనే వార్తలు కూడా వచ్చాయి. కానీ చాలా సందర్భాల్లో తమ మధ్య లవ్ లేదని రష్మిక వెల్లడించింది.
![]() |