![]() |
![]() |

నితిన్ హీరోగా శ్రీ లీల హీరోయిన్ గా వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన నయా చిత్రం ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్. డిసెంబర్ 8 న వరల్డ్ వైడ్ గా విడుదల అవుతున్న ఈ చిత్రం కోసం నితిన్ అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.ఇటీవలే ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయ్యి సినిమా మీద అమాంతం అంచనాల్ని పెంచేసింది. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన క్రేజీ అప్ డేట్ ఒకటి బయటకి వచ్చింది..
ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ నుండి తాజాగా ఒలే ఒలే పాపాయి అనే సాంగ్ రిలీజ్ అయ్యింది. లిరికల్ వీడియోతో సహా రిలీజ్ అయిన ఈ పాట విడుదలైన కాసేపట్లోనే రికార్డ్స్ ని సృష్టిస్తుంది. పాట మంచి స్పీడ్ తో ఉండి ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకుంటుంది. అలాగే నితిన్ ,శ్రీ లీల ఇద్దరు కూడా బెస్ట్ డాన్సర్స్ కాబట్టి రేపు థియేటర్స్ లో ఈలలు కేకలతో మోతమోగిపోవడం ఖాయం.

శ్రేష్ట్ మూవీస్ పతాకంపై సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి మరికొందరి భాగస్వామ్యంతో నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ సీనియర్ హీరో రాజశేఖర్, రావు రమేష్, రోహిణి, సంపత్ రాజ్, బ్రహ్మాజీ, హైపర్ ఆది, హరి తేజ, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. హరీష్ జయరాజ్ సంగీతాన్ని అందించిన ఈ మూవీ ప్రమోషన్స్ ప్రస్తుతం వేగవంతంగా జరుగుతున్నాయి.
![]() |
![]() |