![]() |
![]() |
నాని లేటెస్ట్ మూవీ ‘హాయ్ నాన్న’. శౌర్యువ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా డిసెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించింది. గెస్ట్‌గా శృతి హాసన్ నటించింది. ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్స్‌ను ఎంతో బాధ్యతగా నాని ముందుకు తీసుకెళ్తున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో నాని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. మృణాల్ ఠాకూర్ తన ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉండటం వలన ఎక్కువ సమయం ఈ మూవీ ప్రమోషన్స్‌కి కేటాయించలేకపోయిందని నాని క్లారిటీ ఇచ్చారు. కాని ఆమె పెర్ఫార్మెన్స్ సినిమాలో చాలా అద్భుతంగా ఉంటుందని, ముఖ్యంగా ప్రీక్లైమాక్స్‌లో ఆమె యాక్టింగ్‌కి ఫిదా అయిపోయానని అన్నారు.
ఇదిలా ఉంటే.. ‘హాయ్ నాన్న’ ప్రమోషన్స్‌లో భాగంగా వైజాగ్‌లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఎవరూ ఊహించని విధంగా జరిగిన సంఘటనను నాని ఈ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు. ఈ ఈవెంట్‌లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పర్సనల్ ఫోటోలను ప్రదర్శించడం బాధ కలిగించిందని, పొరపాటుగా అలా జరిగిందని అన్నారు. నిర్వాహకులు ఆ ఫోటోలను చూపించకుండా ఉంటే బాగుండేది అన్నారు. ఈ విషయంలో విజయ్, రష్మిక బాధ పడి వుంటే వారిని క్షమాపణ చెబుతున్నానని అన్నారు నాని.
![]() |
![]() |