![]() |
![]() |
ఎఐ టెక్నాలజీతో రూపొందించిన రష్మిక డీప్ ఫేక్ వీడియో ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. దీనిపై పెద్ద రభసే జరిగింది. ఇలాంటి నీచమైన చర్యలు మానుకోవాలని ఎంతో మంది సినీ ప్రముఖులు హితవు పలికారు. రష్మికకు ఎంతోమంది అండగా నిలిచారు. రష్మికకు వచ్చిన కష్టానికి అందరూ చలించిపోయారు. నెటిజన్లు సైతం ఆమెను సపోర్ట్ చేశారు. ఇప్పుడు సీన్ రివర్స్ అయినట్టు కనిపిస్తోంది. దానికి కారణం తాజాగా విడుదలైన ‘యానిమల్’ మూవీ. ఈ సినిమా రష్మిక చేసిన సీన్లను చూసి అందరూ షాక్ అయ్యారు. రష్మిక ఫేక్ వీడియో రాకముందు అయితే ఎవరూ పెద్దగా పట్టించుకునేవారు. కాదు, ఫేక్ వీడియో ఉదంతం జరిగి కొన్ని రోజులు కూడా కాకముందే ఈ సినిమా రిలీజ్ అవ్వడం, అందులో రష్మిక రెచ్చిపోయి రొమాన్స్ చేయడం చాలామందికి నచ్చలేదు. ఇందులో హీరో హీరోయిన్ల మధ్య హాట్ హాట్ సీన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా రణబీర్, రష్మిక మధ్య వచ్చే ముద్దు సీన్లు యూత్‌ని బాగా హీట్ ఎక్కిస్తున్నాయి. ఇప్పుడీ సీన్స్‌తో రష్మికను ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.
కొన్నిరోజుల క్రితం వచ్చిన డీప్ ఫేక్ వీడియో వల్ల రష్మిక ఎంత బాధపడిరదో తెలీదుగానీ, సినీ ప్రముఖులు, నెటిజన్లు, ఆమె అభిమానులు మాత్రం చాలా బాధపడ్డారు. ఇప్పుడు యానిమల్ సినిమాలో ఆమె చేసిన సీన్స్‌ను ప్రస్తావిస్తూ ఆమెకు వ్యంగంగా కామెంట్లు పెడుతున్నారు. ఫేక్ వీడియోకి మించిన సీన్స్ ఈ సినిమాలో ఉన్నాయంటున్నారు. రష్మిక ఫేక్ వీడియో చూడాల్సిన అవసరం ఇప్పుడు లేదని, యానిమల్ సినిమా చూస్తే సరిపోతుందని సెటైర్లు వేస్తున్నారు. సినిమాల్లో ఎంత హాట్ సీన్స్ అయినా చేస్తావు, బయట అలాంటి ఫేక్ వీడియో వస్తే ఎందుకంత బాధపడడం అంటూ రష్మికను విమర్శిస్తున్నారు నెటిజన్లు. ఇదిలా ఉంటే కొందరు రష్మికను సపోర్ట్ చేస్తున్నారు. సినిమాని సినిమాగా చూడాలి తప్ప ఇలాంటి విమర్శలు చేయకూడదని కొందరు నెటిజన్లు విమర్శించే వారిని దృష్టిలో పెట్టుకొని కామెంట్ చేస్తున్నారు. నిన్న మొన్నటి రష్మికపై జాలి చూపించినవారే ఇప్పుడు విమర్శిస్తున్నారంటే యానిమల్‌లో ఆమెను చూసి ఎంత బాధ కలిగిందో అర్థం చేసుకోవచ్చు.
![]() |
![]() |