![]() |
![]() |

సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులతో పాటు తెలుగు సినీ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మూవీ గుంటూరు కారం. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. ప్రేక్షకులకి ప్రామిస్ చేసిన దాని ప్రకారం సంక్రాంతికి రావటానికి అన్ని మెరుగులని దిద్దుకుంటున్న గుంటూరు కారంకి సంబంధించిన లేటెస్ట్ న్యూస్ ఒకటి మహేష్ అభిమానుల్లో జోష్ ని తెస్తుంది.
గుంటూరు కారం నుంచి ఇటీవల వచ్చిన దమ్ మసాలా సాంగ్ యుట్యూబ్ లో 30 మిలియన్ వ్యూస్ ని అందుకుంది. ఒక తెలుగు సాంగ్ ఈ మధ్య కాలంలో ఇంత స్థాయిలో వ్యూస్ ని సాధించడం ఒక రికార్డు అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ వార్తలతో మహేష్ ఫాన్స్ గుంటూరు కారం సెలెబ్రేషన్స్ ని స్టార్ట్ చేసారు. థమన్ మ్యూజిక్ లో వచ్చిన ఈ సాంగ్ రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డు లు సృష్టించడం ఖాయం అని కూడా అభిమానులు అంటున్నారు.

2024 జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్స్ లో విడుదల కానున్న గుంటూరు కారంలో మహేష్ సరసన శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లు గా నటిస్తుండగా రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, సునీల్, జయరాం, జగపతి బాబు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
![]() |
![]() |