![]() |
![]() |

పవన్ కళ్యాణ్ అనే పేరు వినబడితే చాలు సినిమాల్లోను రాజకీయాల్లోను ఒక రకమైన వైబ్రేషన్ వస్తుంది. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ నిశ్శబ్దం అనే పదానికి అసలు తెలుగు డిక్షనరీ లో చోటు ఉందా అనే అనుమానం ప్రతి ఒక్కరికి కలుగుతుంది. ఆయన ఒక్క పిలుపుని ఇస్తే చాలు అభిమానులు పవన్ కోసం ఏమైనా చెయ్యడానికి వెనుకాడరు. పవన్ కూడా తన అభిమానుల కోసం ఎంతవరకైనా వెళ్తాడు. అలాగే తనకి సంబంధించిన అన్ని విషయాలని సోషల్ మీడియా ద్వారా తన అభిమానులకి ఎప్పటికప్పుడు తెలియచేస్తాడు. పవన్ తాజాగా తన ఇనిస్టా లో చేసిన ఒక వీడియో వైరల్ గా మారింది.
పవన్ ప్రస్తుతం తన కొత్త సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉంటూనే పొలిటికల్ గా కూడా ఫుల్ బిజీగా ఉన్నాడు. ఒక పొలిటికల్ మీటింగ్ నుంచి వస్తున్న పవన్ తాజాగా హైదరాబాద్ లోని బేగంపేట ఎయిర్ పోర్ట్ లో ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు అక్కడ ఉన్న బిందు అనే పోలీసు డాగ్ ఒకటి పవన్ కళ్యాణ్ దగ్గరకి వచ్చి పవన్ కి షేక్ హ్యాండ్ ఇచ్చింది. దీంతో అక్కడున్న పోలీసులందరు ఒక్కసారిగా షాక్ అయ్యారు. పవన్ ఇందుకు సంబంధించిన వీడియో ని తన ఇనిస్టా లో పోస్ట్ చేస్తు కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలని కూడా చేసాడు. నేను ఎయిర్ పోర్ట్ కి వెళ్ళగానే నా కోసం అనుకోని అతిధి వచ్చింది. ఆ అతిధి బిందు అనే పోలీసు డాగ్. నాతో చాలా స్నేహంగా ఉంది అంతే కాకుండా నన్ను కలవటం తనకి చాలా ఉత్సాహం గా ఉందనే భావాన్ని కూడా బిందు నాకు ఇచ్చింది అని చెప్పాడు.
ఇప్పుడు ఈ వీడియో ని చూస్తున్న పవన్ ఫ్యాన్స్ చాలా ఆనందంతో ఉన్నారు. కొంత మంది అయితే పోలీసు డాగ్ లు అంటే చాలా పవర్ ఫుల్ గా ఉంటాయి. అలాంటి డాగ్ పవన్ దగ్గరకి వెళ్లి పవన్ కి షేక్ హ్యాండ్ ఇచ్చిందంటే పవన్ ది చాలా మంచి మనసు అని ఆ పోలీసు డాగ్ కి అర్ధమయ్యింటుందని అంటున్నారు.
![]() |
![]() |