![]() |
![]() |
కమల్‌హాసన్ స్వీయ దర్శకత్వంలో నటించి నిర్మించిన సినిమా ‘విరుమాండి’. ఈ సినిమా 2004లో సంక్రాంతి కానుకగా విడుదలై ఘనవిజయం సాధించింది. తెలుగులో ఈ సినిమాను ‘పోతురాజు’ పేరుతో డబ్ చేశారు. తెలుగులోనూ మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో కమల్‌హాసన్ సరసన అభిరామి హీరోయిన్‌గా నటించింది. తెలుగులో అభిరామికి యాంకర్ రaాన్సీ డబ్బింగ్ చెప్పింది. అభిరామికి విరుమాండి మంచి పేరు తెచ్చింది. 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ కమల్‌హాసన్ సినిమాలో నటించబోతోంది అభిరామి.
కమల్‌హాసన్, మణిరత్నం కాంబినేషన్‌లో వచ్చిన ‘నాయకుడు’ ఎన్ని సంచలనాలు సృష్టించిందో, ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. మళ్ళీ వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ సినిమాను ఇటీవల ప్రకటించారు. ఆ సినిమాకు ‘థగ్ లైఫ్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమాలో త్రిష, జయం రవి, దుల్కర్ సల్మాన్ వంటి స్టార్స్ నటిస్తున్నారు. ఇదిలా ఉండగా అభిరామి కూడా ఈ సినిమాలో ఓ ప్రధాన పాత్ర పోషిస్తోందట. తను పోషించే క్యారెక్టర్‌కి సంబంధించిన విశేషాలను దర్శకనిర్మాతలు తెలియజేస్తారంటోంది అభిరామి. 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ కమల్‌హాసన్‌తో కలిసి నటించడం తనకెంతో సంతోషాన్ని కలిగిస్తోందని అంటోంది. విరుమాండి సంక్రాంతికి రిలీజ్ అయింది. ఇప్పుడు ‘థగ్ లైఫ్’ చిత్రం సంక్రాంతికి ప్రారంభం కాబోతోంది.
![]() |
![]() |