![]() |
![]() |

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్న గుంటూరు కారం మూవీకి సంబంధించిన షూటింగ్ లో ఫుల్ బిజీ గా ఉన్నాడు. సంక్రాంతికి రాబోతున్నఈ మూవీ మీద మహేష్ ఫ్యాన్స్ లోను సినీ ప్రేక్షకుల్లోను భారీ అంచనాలే ఉన్నాయి. తను నటించిన సినిమాల్లోని పిక్స్ ద్వారా సోషల్ మీడియాలో ఎప్పుడు ట్రెండ్ సృష్టించే మహేష్ తాజాగా సినిమాతో సంబంధం లేని పిక్స్ తో కూడా ట్రెండ్ సృష్టిస్తున్నాడు.

తాజాగా మహేష్ బాబు తన ఫ్రెండ్ బర్త్ డే వేడుకల్లో పాల్గొన్నాడు. సాధారణంగా మహేష్ బయట ఎక్కువగా కనపడడు. అలాంటిది హైదరాబాద్ లో జరిగిన తన ఫ్రెండ్ బర్త్ డే వేడుకలకి హాజరయ్యి ఫంక్షన్ చివరి దాకా ఉండి తన ఫ్రెండ్ కి ఆ పుట్టిన రోజుని అతని లైఫ్ లో కూడా మర్చి పోలేని ఒక మెమోరిబెల్ డే గా మహేష్ మిగిల్చాడు. సోషల్ మీడియా ద్వారా ఈ విషయం తెలుసుకున్న చాలామంది ఆ ఫ్రెండ్ ఎవరని ఆరాతీస్తున్నారు. నమ్రత తన ఇన్స్టాగ్రామ్ లో బర్త్ డే పిక్స్ పోస్ట్ చెయ్యడంతో విషయం బయటకి తెలిసింది. ఆ ఫొటోల్లో సింపుల్ గా ఉన్న మహేష్ ని చూసిన ఫ్యాన్స్ మహేష్ సింప్లిసిటీ ని మెచ్చుకుంటు మహేష్ ఫ్రెండ్ కి బర్త్ డే విషెస్ చెప్తున్నారు.
![]() |
![]() |