Home

»

Latest News

పార్కింగ్‌ కోసం హత్యలా.. కొత్త పాయింట్‌తో సరికొత్త సినిమా!

Nov 16, 2023 4:34PM

అద్దె ఇంట్లో నివసించేవారికి నిత్యం ఎదురయ్యే సమస్య పార్కింగ్‌. ఈ సమస్యను ఎదుర్కోని వారు ఉండరు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో అలాంటి ఇబ్బంది పడినవారే. అలాంటి  ఓ కథాంశంతో రూపొందిన సినిమా ‘పార్కింగ్‌’. తన వాహనాన్ని ఎక్కవ పార్క్‌ చేయాలి.. ఆ స్థలం కారణంగా చెలరేగిన వివాదం ఎలాంటి పరస్థితులకు దారి తీసింది? వంటి ఆసక్తికర అంశాలతో రూపొందిన సినిమా ‘పార్కింగ్‌’. ఈ సినిమా డిసెంబర్‌ 1న విడుదల కాబోతోంది. హరీష్‌ కళ్యాణ్‌, ఇందుజ జంటగా నటించిన ఈ సినిమాకి రామ్‌కుమార్‌ బాలకృష్ణన్‌ దర్శకుడు. 

ఈ సినిమా గురించి దర్శకుడు తెలియజేస్తూ ‘నగరాల్లో పార్కింగ్‌ అనేది పెద్ద సమస్య.  దానివల్ల ఎన్నో వివాదాలు, ఘర్షణలు చోటు చేసుకోవడం, కొన్ని సందర్భాల్లో హత్యలు కూడా జరగడం మనం వార్తల్లో చూస్తుంటాం. యదార్థ ఘటనల ఆధారంగా రూపొందించిన సినిమా ఇది. దానికి కొంత హ్యూమన్‌ టచ్‌ను కూడా జోడిరచి ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా తీర్చిదిద్దడం జరిగింది. ఒక సమస్య ఉత్పన్నమైతే ఒక్క క్షణం మానవత్వంతో ఆలోచిస్తే దానికి పరిష్కారం కూడా లభిస్తుంది. ఈ చిత్రంలోని ప్రధానాంశం ఇదే. ఈ సినిమా షూటింగ్‌ 36 రోజుల్లో పూర్తి చేశాం. ఎక్కువ భాగం చెన్నై వలసరవాక్కం, విల్లివాక్కంలలో చిత్రీకరించగా, కొన్ని సన్నివేశాలను ఈసీఆర్‌లో షూట్‌ చేశాం. ఆద్యంతం ఎంతో ఇంట్రెస్టింగ్‌గా సాగే ఈ సినిమా తప్పకుండా ప్రతి ఒక్కరినీ అలరిస్తుంది’ అన్నారు. 
 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com