![]() |
![]() |
.webp)
సూపర్ స్టార్ రజనీ కాంత్ అతిధి పాత్రలో నటిస్తున్న చిత్రం లాల్ సలాం. విష్ణు విశాల్, విక్రాంత్ లు హీరోలుగా చేస్తున్న ఈ మూవీకి రజనీ కూతురు సౌందర్య దర్శకత్వం వహిస్తుంది. నిన్ననే ఈ మూవీ నుంచి టీజర్ ఎప్పుడు వస్తుందో అనే అప్ డేట్ ని ప్రకటించిన మేకర్స్ ఇప్పుడు తాజాగా లాల్ సలాం కి సంబంధించిన తాజా అప్ డేట్ ఒక దాన్ని ప్రకటించారు.

లాల్ సలాం మూవీ ఆడియో రైట్స్ ని సోనీ మ్యూజిక్ సొంతం చేసుకుంది.ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ అధికారికంగా ఒక ప్రకటన కూడా జారీచేసింది. ఈ చిత్రానికి ఇండియన్ సినీ పరిశ్రమ గర్వించే లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా పాన్ ఇండియా లెవెల్లో ఈ లాల్ సలాం మూవీ విడుదల కాబోతుంది.
జైలర్ విజయం తో మళ్ళీ ఫామ్ లో కొచ్చిన రజనీ లాల్ సలాం మూవీ లో కూడా తన విశ్వరూపాన్ని చూపించబోతున్నాడనే వ్యాఖ్యలు తమిళ చిత్ర పరిశ్రమ వర్గాల నుంచి వినపడుతున్నాయి. రజనీది ఈ సినిమాలో గెస్ట్ రోల్ అయినా కూడా సినిమా మాత్రం రికార్డు లు సృష్టించడం పక్కా అని అటు రజనీ ఫ్యాన్స్ అండ్ మూవీ లవర్స్ అంటున్నారు .
![]() |
![]() |