![]() |
![]() |

నందమూరి బాలకృష్ణ నట విశ్వరూపం తాలూకు రూపాన్ని మరోసారి ప్రేక్షకులకి తెలియచేసిన మూవీ భగవంత్ కేసరి. తాజాగా వచ్చిన ఈ మూవీలోని బాలయ్య నటనకి ఫిదా అవ్వని ప్రేక్షకుడు లేడు. దసరా విన్నర్ గా నిలిచి ఎన్నో రికార్డులని తన ఖాతాలో వేసుకున్న బాలయ్య ఇప్పుడు మరో సరికొత్త రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు.
భగవంత్ కేసరి సినిమాలోని పాటలన్ని కూడా సూపర్ డూపర్ హిట్ గా నిలిచిన విషయం అందరికి తెలిసిందే. మరి ముఖ్యంగా ఉయ్యాలో ఉయ్యాలో సాంగ్ అయితే ప్రేక్షకులకి విపరీతంగా నచ్చింది. ఇప్పుడు ఈ సాంగ్ తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఒక సరికొత్త రికార్డుని తన పేరున నమోదుచేసుకుంది. ఉయ్యాలో ఉయ్యాలో పాట యు ట్యూబ్ లో 21 మిలియన్ వ్యూస్ తో ముందుకు దూసుకుపోతుంది.
ఉయ్యాలో ఉయ్యాలో పాట అంత స్థాయిలో విజయం సాధించడానికి ప్రధాన కారణం ఆ పాట యొక్క లిరిక్స్ తో పాటు ఆ పాటలో బాలయ్య పండించిన పెర్ఫామెన్స్ అలాగే శ్రీ లీల హావభావాలు కూడా ప్రధాన కారణం అని చెప్పవచ్చు. ఇంకో పక్క ఉయ్యాలో ఉయ్యాలో పాట అంత స్థాయిలో రికార్డు లు సృష్టించడంతో బాలయ్య అభిమానులు జై బాలయ్య అంటు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలాగే బాలయ్య గతంలో నటించిన లెజెండ్ సినిమాలోని ఒక డైలాగ్ ని కూడా అభిమానులు గుర్తుచేసుంటున్నారు. ఆ సినిమాలో బాలయ్య తన శత్రువైన జగపతిబాబుతో నీకు చంపే కొద్దీ అలుపు వస్తుందేమో నాకు ఊపు వస్తుంది అని అంటాడు. ఇప్పుడు బాలయ్య అభిమానులు ఈ డైలాగ్ నే గుర్తు చేసుకుంటు మా బాలయ్య ఉయ్యాలో ఉయ్యాలో సాంగ్ కి ప్లే అయ్యే కొద్దీ ఊపు వస్తుందని తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
![]() |
![]() |