![]() |
![]() |

క్రియేటివ్ కమర్షియల్ అధినేత కె ఎస్ రామారావు సమర్పణలో ఇండో అమెరికన్ ఆర్ట్స్ పతాకంపై నిహాల్ హీరోగా ఫ్యామిలీ మాన్ సిరీస్ ఫేమ్ అశ్లేష ఠాకూర్ హీరోయిన్ గా త్రివిక్రమ్ శేషు దర్శకత్వంలో రూపుదిద్దుకున్న పీరియాడిక్ చిత్రం శాంతల. నవంబర్ 24న విడుదలకు సిద్ధమవుతున్న శాంతల మూవీ మీద మన భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేసిన వ్యాఖ్యలు సినిమా ఇండస్ట్రీ తో పాటు ప్రేక్షకుల్లో సంచలనం సృష్టిస్తున్నాయి.
తాజాగా వెంకయ్య నాయుడు గారు శాంతల చిత్రాన్ని చూసారు. సినిమా చూసిన ఆయన శాంతల సినిమా ఒక గొప్ప కళాత్మక చిత్రమని నాట్య కళ, మహిళా సాధికారికత ఇతివృత్తంగా చారిత్రక నేపథ్యం లో నిర్మించిన ఈ చిత్రం నా చేత కన్నీళ్లు కూడా తెప్పించిందని ఆయన అన్నారు. అలాగే సినిమాలోని ఎన్నో సన్నివేశాలు నాలో భావోద్వేగాలను కూడా కలిగించాయని అన్నారు. శాంతల చిత్రానికి నేషనల్ అవార్డు రావాలి అని కూడా వెంకయ్య నాయుడుగారు కొనియాడారు. అలాగే శాంతల చిత్రం నిర్మాణపరంగా సాంకేతికంగా ఎంతో ఉన్నతంగా ఉంది. కెమెరా పనితనం, నేపథ్య సంగీతం, నృత్యాలు, కూర్పు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇంతటి మంచి అభిరుచితో సినిమా నిర్మించిన ప్రముఖ నిర్మాత కె ఎస్ రామారావు గారికి డాక్టర్ ఇర్రింకి సురేష్ కి , దర్శకుడు త్రివిక్రమ్ శేషుకి ,సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్ డైరెక్టర్ ఆఫ్ సినిమాటోగ్రఫీ రమేష్ కి అలాగే మూవీలో నటించిన అశ్లేష ఠాకూర్ ,నిహాల్ తదితర ఇతరనటీనటులందరికి వెంకయ్యనాయుడు గారు తన అభినందనలు తెలిపారు. నవంబర్ 24 న తెలుగు, హిందీ, కన్నడ, తమిళం, మరాఠీ మరియు మలయాళం భాషల్లో శాంతల మూవీ విడుదల అవుతుంది.
![]() |
![]() |