Home

»

Latest News

తన అభిమానులకి తీపి కబురు చెప్పిన సీనియర్ నరేష్ 

Nov 8, 2023 4:50PM

ప్రముఖ దివంగత నటి ,దర్శకురాలు  విజయనిర్మల నటవారసుడుగా తెలుగు చిత్ర రంగ చేసి ఎన్నో సినిమాల్లో అద్భుతంగా నటించి అశేష సినీ ప్రేక్షకుల అభిమానాన్ని పొందిన నటుడు నరేష్. రీసెంట్ గా కూడా సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. తన నటనతో  సినిమాకి ఒక రేంజ్ వచ్చేలా చెయ్యడం నరేష్  స్టైల్. తాజాగా ఆయన ఒక తియ్యని వార్తని  తన అభిమానులతో పంచుకున్నాడు.

 2016  వ సంవత్సరంలో  నందిని నర్సింగ్ హోమ్  సినిమాతో  హీరోగా పరిచయం అయిన నరేష్ కొడుకు నవీన్ విజయకృష్ణ  ఇప్పుడు ప్రతిష్టాత్మక ఓనిరోస్ ఫిల్మ్ అవార్డ్ ని దక్కించుకున్నాడు. తన చిన్ననాటి స్నేహితుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా కలర్స్ స్వాతి హీరోయిన్ గా నవీన్ తన దర్శకత్వంలో సత్య  అనే  మ్యూజికల్ ఫ్యూచర్ షార్ట్ ఫిలింని చిత్రీకరించాడు. ఈ సినిమాని   న్యూయార్క్ లో జరిగిన ఓనిరోస్ ఫిల్మ్ అవార్డ్ ఫంక్షన్ లో ప్రదర్శించారు. సినిమా చూసిన అవార్డు కమిటీ ఉత్తమ పరిచయ దర్శకుడి కోటాలో నవీన్ కి అవార్డు ని ప్రకటించింది. ఈ విషయాన్ని నరేష్  ట్విట్టర్ వేదికగా తన అభిమానులకి వెల్లడి చేసాడు. అలాగే  మా కుటుంబంలోని నాలుగో తరం నుంచి  ఇప్పుడు దర్శకుడుగా మీ ముందుకు వస్తున్న నా కుమారుడికి  మీ  అందరి శుభాకాంక్షలు, ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నా అని నరేష్ ట్విటర్ వేదికగా తన అభిమానులని ,ప్రేక్షకులని కోరాడు.

 

సత్య మ్యూజిక్ షార్ట్ ఫిలిం ని  దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హన్షితా రెడ్డి, హర్షిత్ రెడ్డి నిర్మించారు. ఆల్రెడీ ఈ  షార్ట్ ఫిల్మ్ నుంచి సోల్ ఆఫ్ సత్య పేరుతో  ఒక పాట  కూడా విడుదలైంది.  6 నిమిషాల నిడివి ఉన్న ఆ  పాటలో  సత్య  షార్ట్ ఫిల్మ్‌ లో ఉన్న సోల్ ఏంటో చెప్పారు. దేశం కోసం పోరాడే సైనికులను సరిహద్దులకు పంపిస్తూ వాళ్ల ఇళ్లలో మహిళలు చేస్తున్న త్యాగాన్ని కొనియాడుతూ ఈ పాట రూపుదిద్దుకుంది. 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com