![]() |
![]() |

యంగ్ టైగర్ ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివలు మొదటి కొలాబరేషన్ లో జనతా గ్యారేజ్ సినిమా చేసి రీజనల్ బాక్సాఫీస్ ని రిపేర్ చేసారు. ఇప్పుడు రెండోసారి దేవర సినిమాతో పాన్ ఇండియా బాక్సాఫీస్ రికార్డులని రిపేర్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ మోస్ట్ డేంజరస్ కాంబినేషన్ లో దేవర సినిమా హై టెక్నికల్ వాల్యూస్ తో తెరకెక్కుతుంది. సముద్ర తీరాలని ఎరుపెక్కిస్తూ ఎన్టీఆర్ శత్రువులని భయపెట్టే పనిలో ఉన్నాడు. బ్యాక్ టు బ్యాక్ యాక్షన్ ప్యాక్డ్ షెడ్యూల్స్ నే చేస్తున్న కొరటాల శివ, ఇప్పుడు గోవాలో దేవర షూటింగ్ ని చేస్తున్నాడు. మేజర్ కాస్ట్ అండ్ క్రూ పాల్గొంటున్న ఈ షెడ్యూల్ కంప్లీట్ అయ్యే స్టేజ్ లో ఉంది. ఈ షెడ్యూల్ జరుగుతుండగానే దేవర మేకర్స్ నుంచి ఒక అప్డేట్ బయటకి వచ్చింది. మరో 150 రోజుల్లో దేవర పార్ట్ 1 రిలీజ్ అవుతుంది, రెడీగా ఉండండి అంటూ మేకర్స్ ట్వీట్ చేసారు.

ఏప్రిల్ 5న దేవర పార్ట్ 1 రిలీజ్ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని మేకర్స్, ఈ ట్వీట్ తో కన్ఫర్మేషన్ ఇచ్చారు. అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం దీపావళికి దేవర సినిమా నుంచి ఏమైనా అప్డేట్ వస్తుందా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. దీపావళి పండగ రోజున దేవర సినిమా నుంచి ఏదైనా సర్ప్రైజ్ వస్తుందేమో అని వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కి మేకర్స్ క్లారిటీ ఇస్తూ... ఈ దీపావళి అప్డేట్స్ ఏమీ లేవు కానీ పెద్ద బ్లాస్ట్ తో త్వరలో దిగుతున్నాం అంటూ స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చారు. ఈ పెద్ద బ్లాస్ట్ దేవర గ్లిమ్ప్స్ అయితే బాగుంటుందని ఎన్టీఆర్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి ఆ బ్లాస్ట్ ఏంటి? పాన్ ఇండియా రేంజులో అది సౌండ్ చేస్తుందా లేదా? అసలు బ్లాస్ట్ ఎప్పుడు అవుతుంది? అనేది తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.
![]() |
![]() |