![]() |
![]() |

‘భగవంత్ కేసరి’తో హ్యాట్రిక్ సాధించి దసరా విన్నర్‌గా నిలిచి మంచి జోష్ మీద ఉన్న నందమూరి బాలకృష్ణ ఇప్పుడు బాబీ డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన అప్‌డేట్స్ రోజుకొకటి చొప్పున వస్తుండడంతో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాలో బాలయ్య సరసన ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నారన్న వార్త ఇప్పుడు వైరల్‌గా మారింది. చాందిని చౌదరి, ఊర్వశీ రౌతెలా ఈ సినిమాలో బాలయ్యతో కలిసి ఆడి పాడనున్నారు.
ఇదిలా ఉంటే మరో గాసిప్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. అదేమిటంటే.. ఈ సినిమాలో బాలయ్య ఎంట్రీ ఎంతో గ్రాండ్‌గా ఉంటుందట. దాని కోసం బాబీ పకద్బందీ ప్లానింగ్‌తో ముందుకు వెళ్తున్నాడు. దీని కోసం భారీ సెట్స్ వేస్తున్నారని సమాచారం. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ భారీ సెట్ వేస్తున్నారట. ఈ సెట్ లో బాలయ్య, విలన్ల మధ్య యాక్షన్ సీక్వెన్స్‌ను ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. ఈ యాక్షన్ సీక్వెన్స్ సినిమాకే మెయిన్ హైలైట్ అవుతాయట. బాలయ్య ఫ్యాన్స్‌ను హ్యాపీ చేసే ఇలాంటి అంశాలు సినిమాలో చాలా ఉన్నాయని సమాచారం. రవితేజ, ఎన్టీఆర్, పవన్‌కల్యాణ్, చిరంజీవి, వెంకటేష్, నాగచైతన్య వంటి హీరోలతో సినిమాలు చేసి హిట్ కొట్టిన బాబీ మొదటిసారి బాలకృష్ణతో చేస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే బాలయ్య మార్క్ యాక్షన్‌కు ఏమాత్రం సంబంధం లేకుండా.. ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్‌తో సాగే ఎమోషనల్ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు బాబీ. అంతేకాకుండా, ఈ సినిమాలో పాలిటిక్స్ నేపథ్యంలో ఓ ఫ్లాష్ బ్యాక్ కూడా ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమాలో బాలయ్య డ్యూయల్ రోల్‌లో కనిపించబోతున్నాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
![]() |
![]() |