![]() |
![]() |

వరుణ్‌తేజ్, లావణ్య త్రిపాఠిల వివాహం నవంబర్ 1న ఇటలీలో జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుకకు ఇరు కుటుంబాల సభ్యులు, కొందరు సన్నిహితులు, మిత్రులు మాత్రమే హాజరయ్యారు. పెళ్ళికి రెండు రోజుల ముందే ఇరు కుటుంబాల సభ్యులు ఇటలీ చేరుకున్నారు. పెళ్లికి ముందు జరిగే కార్యక్రమాలను ఎంతో సందడిగా జరుపుకున్నారు. నవంబర్ 5న హైదరాబాద్‌లో వరుణ్, లావణ్యల రిసెప్షన్ జరిగింది. ఈ కార్యక్రమానికి సినీ ప్రముఖులు ఎందరో హాజరయ్యారు.
ఈ వివాహ వేడుక గురించి మీడియాలో ప్రత్యేకంగా కవరేజ్ వచ్చింది. అయితే అందరూ ఈ వేడుకను చూడాలన్న ఆసక్తితో ఉన్నారు. అందుకే ఈ వేడుకను ఓటీటీలో ప్రసారం చేయనున్నారు. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ వేడుకను అందరూ చూసే వీలు కల్పిస్తున్నారు. మూడు రోజులపాటు జరిగిన ఈ వివాహ వేడుకను తమ ఓటీటీలో స్ట్రీమ్ చేసే హక్కులను దాదాపు రూ.8 కోట్లకు నెట్‌ఫ్లిక్స్ సంస్థ కొనుగోలు చేసిందని సమాచారం. ఇంతకుముందు నయనతార, విఘ్నేష్‌ల వివాహం, హన్సిక, సొహైల్‌ల వివాహం కూడా ఓటీటీలో స్ట్రీమ్ అయింది. ఇప్పుడు వరుణ్‌తేజ్, లావణ్య త్రిపాఠిల వివాహం కూడా ఓటీటీలోకి రాను.ంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. ఎప్పటి నుంచి ఈ వేడుక స్ట్రీమింగ్ అవుతుందనే వివరాలను కూడా త్వరలోనే వెల్లడిస్తారు.
![]() |
![]() |