![]() |
![]() |
మంచు లక్ష్మీ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో, ఎంత సందడి చేస్తుందో అందరికీ తెలిసిందే. లెక్కకు మించిన సినిమాలు చేయనప్పటికీ చేసిన కొద్ది సినిమాలతోనే మంచి నటిగా పేరు తెచ్చుకుంది. నటిగానే కాకుండా యాంకర్‌గా కూడా శభాష్ అనిపించుకుంది. నటిగా, యాంకర్‌గా మంచి పేరు తెచ్చుకున్నప్పటికీ సినిమా ఆఫర్స్ మాత్రం ఆమె దరికి చేరడం లేదు. గుండెల్లో గోదారి, వైఫ్ ఆఫ్ రామ్, దొంగాట వంటి సినిమాల్లో కనిపించి అందర్నీ మెప్పించిన లక్ష్మీ ఇప్పుడు యూ ట్యూబ్‌లో కూడా సందడి చేస్తోంది లక్ష్మీ. మై హోమ్ టూర్, మై మేకప్ అంటూ వీడియోలు చేసి యూ ట్యూబ్ ద్వారా అందర్నీ పలకరిస్తోంది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో స్పెషల్‌గా తీసిన గ్లామరస్ స్టిల్స్‌ను పోస్ట్ చేసింది. మోడరన్ డిజైనర్ శారీలో హాట్‌గా ఉన్న ఫోటోలను షేర్ చేసింది.
ఇప్పటివరకు సోషల్ మీడియాలో ఏదో ఒక కామెంట్ చేస్తూనో, ఏదైనా అనుకోని ఘటన జరిగితే దాని గురించి స్పందించడమో చేస్తూ వచ్చిన లక్ష్మీ ఇప్పుడు హాట్ ఫోటోలతో కుర్రకారుకి పిచ్చెక్కించేందుకు సిద్ధపడిరది. బ్లాక్ శారీలో అందాలు ఉట్టిపడేలా ఫోజులిచ్చి అందరి మతిపోగొడుతోంది. మంచు లక్ష్మీ హాట్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మరి ఇది ఏదైనా సినిమా కోసం చేసిన ఫోటోషూటా లేక స్పెషల్‌గా తనే తీయించుకున్న ఫోటోలా అనేది తెలియాల్సి ఉంది.
![]() |
![]() |