![]() |
![]() |

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల వివాహం రెండు కుటుంబాల సభ్యులు, సన్నిహితులు, మిత్రుల సమక్షంలో ఇటలీలో వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ఇక రిసెప్షన్‌ని కూడా హైదరాబాద్‌లో ఎంతో ఘనంగా నిర్వహించింది మెగా ఫ్యామిలీ. ఆదివారం జరిగిన వివాహ రిసెప్షన్‌కి ఎంతో మంది సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ రిసెప్షన్‌లో వరుణ్, లావణ్య త్రిపాఠి ధరించిన కాస్ట్యూమ్స్ గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. ముఖ్యంగా లావణ్య త్రిపాఠి కట్టుకున్న బంగారు వర్ణం చీరను ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా డిజైన్ చేశారట. బాలీవుడ్ ప్రముఖులతోపాటు ఎంతోమంది సౌత్ ఇండియన్ సెలబ్రిటీలకు కూడా ఆయన ఖరీదైన చీరలు, ఇతర డ్రెస్‌లను డిజైన్ చేయడం జరిగింది. లావణ్య త్రిపాఠి ఫిజిక్ మరియు ఆమె స్కిన్ టోన్‌కి సెట్ అయ్యే విధంగా ఈ చీరను డిజైన్ చేయడం జరిగిందట. ఇదే తరహా మోడల్ చీరను గతంలో షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ ధరించి ఉన్న ఫోటోలు మరోసారి ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
రిసెప్షన్‌లో లావణ్య కట్టుకున్న చీర ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చగా మారింది. హుందాగా, అందంగా కనిపించేందుకు ఈ చీర బాగా ఉపయోగపడిరదని అందరూ అభిప్రాయపడుతున్నారు. నిన్న మొన్నటి వరకు ఇటలీలో జరిగిన పెళ్లికి ఎంత ఖర్చయింది అనే అంశాన్ని పెద్ద ఎత్తున డిస్కస్ చేసిన నెటిజన్లు ఇప్పుడు పెళ్లిలో లావణ్య కట్టుకున్న ఎర్ర చీర ఖరీదు, రిసెప్షన్‌లో కట్టుకున్న చీర ఖరీదు గురించి ఆరా తీస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం మేరకు పెళ్లిలో కట్టుకున్న చీర రూ.10 లక్షలని, రిసెప్షన్ చీర రూ.2.75 లక్షలని తేల్చారు నెటిజన్లు.
![]() |
![]() |