![]() |
![]() |

భారతదేశానికి నాలుగు వైపులా ఉన్న సముద్రాలు ఎలా అయితే రక్షణగా ఉన్నాయో సినిమా అనేది భారతదేశ మనుగడకి రక్షణగా ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. 1913 లో పుట్టిన సినిమా నేటి వరకు రకరకాల ఆధునికతలని సంతరించుకొని తనకి ఎదురులేదనే విధంగా పరుగులు పెడుతూనే ఉంది. సినిమా ఎంతో మందిని గొప్పవాళ్ళని చెయ్యడంతో పాటు ఎంతో మందికి జీవనోపాధిని కల్పిస్తూ ఉంది. అలాంటి సినిమా మీద జరుగుతున్న భారీ కుట్రని కేంద్ర ప్రభుత్వం కుట్ర తాలూకు విలువ తో సహా వెల్లడించడంతో ఆ వార్త విన్న అందరు షాక్ కి గురవుతున్నారు.
కేంద్ర సమాచార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తాజాగా సినిమా కి జరుగుతున్న అన్యాయం గురించి వెల్లడి చేసాడు. డైరెక్ట్ గా ఒక ప్రెస్ నోట్ ని కూడా రిలీజ్ చేసాడు. పైరసీ అనే ఒక భయంకరమైన పెను భూతం బారిన పడి . సినిమా రంగం ప్రతి సంవత్సరం 20000 కోట్ల రూపాయిల ని నష్టపోతుందని చెప్పాడు. అనురాగ్ చెప్పిన ఈ వార్తతో ఒక్కసారిగా భారతీయ చిత్ర పరిశ్రమ ఉలిక్కిపడింది. సినిమా పరిశ్రమ మీద ఎంతో మంది ఆధారపడి బతుకుతున్నారని అలాంటి సినీ పరిశ్రమ పైరసీ వల్ల సంవత్సరానికి 20000 కోట్లు నష్టపోతుండటం అందరికి చాలా బాధగా ఉందని పైరసీ ని రూపు మాపేందుకు స్పెషల్ ఆఫీసర్లని నియమిస్తున్నామని చెప్పాడు.
కొత్తగా ఏర్పడిన సినిమాటోగ్రఫీ చట్టం ప్రకారం సినిమాని నేరుగా పైరసీ చేసినా డిజిటల్ పైరసీ చేసినా 3 నెలల నుంచి 3 సంవత్సరాల దాకా జైలు శిక్ష తో పాటు 3 లక్షల రూపాయిల దాకా జరిమానా విధిస్తారు. అలాగే పైరసీ చేసిన సినిమా తాలూకు బడ్జట్ లో 5 % దాకా వసూలు చేస్తారు. అలాగే తన సినిమా పైరసీ జరిగిందని దాని తాలూకు వివరాలని కూడా మేకర్స్ అధికారులకి సమర్పించవచ్చు.
![]() |
![]() |