![]() |
![]() |

ఈ ఏడాది 'బేబీ'తో బ్లాక్ బస్టర్ అందుకున్న ఆనంద్ దేవరకొండ ఇప్పుడు 'డ్యూయెట్' పాడుతా అంటున్నాడు. ఆనంద్ నటిస్తున్న కొత్త సినిమా 'డ్యూయెట్'. ఈ సినిమా నేడు(నవంబర్ 2) హైదరాబాద్ లో ఘనంగా ప్రారంభమైంది. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ బ్యానర్ లో కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. మధుర శ్రీధర్ రెడ్డి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మిథున్ వరదరాజ కృష్ణన్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రంలో రితిక నాయక్ హీరోయిన్ గా నటిస్తోంది.
హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ లో "డ్యూయెట్" సినిమా ప్రారంభోత్సవం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హీరో విజయ్ దేవరకొండ, దర్శకులు హరీశ్ శంకర్, చందూ మొండేటి, సాయి రాజేశ్, హీరో సత్య దేవ్, ఆనంద్ పేరెంట్స్ గోవర్థన్ దేవరకొండ, మాధవి అతిథులుగా హాజరయ్యారు. మూహూర్తపు సన్నివేశానికి హీరో హీరోయిన్లపై దర్శకుడు హరీశ్ శంకర్ క్లాప్ నివ్వగా.. దర్శకుడు సాయిరాజేశ్, జ్ఞానవేల్ రాజా, సహ నిర్మాత మధుర శ్రీధర్ స్క్రిప్ట్ ను దర్శకుడు మిథున్ కి అందజేశారు. ఫస్ట్ షాట్ డైరెక్షన్ చందూ మొండేటి చేశారు. ఆనంద్ పేరెంట్స్ గోవర్ధన్ దేవరకొండ మాధవి దేవరకొండ కెమెరా స్విచ్ఛాన్ చేశారు.

ఈ సందర్భంగా దర్శకుడు మిథున్ వరదరాజ కృష్ణన్ మాట్లాడుతూ, "డ్యూయెట్ సినిమాతో టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం కావడం సంతోషంగా ఉంది. ఇదొక మంచి లవ్ స్టోరి. దర్శకుడిగా నాకు అవకాశం ఇచ్చిన నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా గారికి థ్యాంక్స్. ఆనంద్ కు కూడా కృతజ్ఞతలు చెబుతున్నా. మధుర శ్రీధర్ గారు మా టీమ్ కు ఏ సమస్య వచ్చినా సాల్వ్ చేయడానికి ఉన్నారు. మాకు సపోర్ట్ అందిస్తున్న అందరికీ థ్యాంక్స్" అన్నారు.
హీరో ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ, "డ్యూయెట్ నాకొక స్పెషల్ మూవీ. ఈ సినిమా టైటిల్ ను ఇండస్ట్రీలోని ఫ్రెండ్స్ తో షేర్ చేసుకున్నప్పుడు మంచి టైటిల్.. మేము రిజిస్టర్ చేసుకుంటే బాగుండేది అన్నారు. అక్కడి నుంచి డ్యూయెట్ మీద పాజిటివ్ వైబ్స్ మొదలయ్యాయి. ఈ మూవీకి నన్ను సెలెక్ట్ చేసుకున్న నిర్మాతలు జ్ఞానవేల్ రాజా, మధుర శ్రీధర్ గారికి థ్యాంక్స్. జ్ఞానవేల్ గారు తమిళంలో సూర్య, కార్తి గారితో పెద్ద మూవీస్ చేశారు. ఇక్కడ నాతో మా అన్నయ్యతో అలాగే ప్రొడ్యూస్ చేయాలి. తెలుగులో బిగ్ మూవీస్ చేయబోతున్నారు జ్ఞానవేల్ రాజా. ఆ భారీ లైనప్ లోని మూవీస్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. మా సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ మ్యూజిక్ డైరెక్టర్ అనగానే చాలా హ్యాపీగా ఫీలయ్యా. ఆడుకాలం మూవీ నుంచి నేను ఆయనకు ఫ్యాన్ ను. అశోకవనంలో అర్జునకల్యాణం మూవీలో రితిక సూపర్బ్ గా నటించింది. మిథున్ అమేజింగ్ స్టోరీ రాశాడు. మా టీమ్ తో కలిసి ఒక మంచి మూవీ చేయబోతున్నాం." అన్నారు.
హీరోయిన్ రితిక నాయక్ మాట్లాడుతూ, "డ్యూయెట్ కథ విన్నప్పుడు మెస్మరైజ్ అయ్యాను. ఎప్పుడు షూటింగ్ కు వెళ్దామా అనేంత క్యూరియాసిటీ ఏర్పడింది. ఆనంద్ గారితో పనిచేయడం గౌరవంగా భావిస్తున్నా. నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ మిథున్, ప్రొడ్యూసర్స్ జ్ఞానవేల్, శ్రీధర్ గారికి థ్యాంక్స్" అన్నారు.
నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా మాట్లాడుతూ, "నేను సూర్య, కార్తీతో కోలీవుడ్ లో మూవీస్ చేసినట్లే.. ఇక్కడ విజయ్ తో నోటా సినిమా చేశాను, ఆనంద్ తో డ్యూయెట్ మూవీ నిర్మిస్తున్నాను. ఆనంద్ నాకు చాలాకాలంగా తెలుసు. ఎప్పుడూ నవ్వుతూ పాజిటివ్ గా ఉంటాడు. అతనికి ఫస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ మా సంస్థలోనే ఇవ్వాలనుకున్నాం. ఈ సినిమా కమిట్ అయినప్పుడు ఆయన బేబి అనే సినిమా చేస్తున్నాడని తెలియదు. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఆనంద్ కు ఫస్ట్ బ్లాక్ బస్టర్ ఇచ్చే అవకాశం మాకు దొరకలేదు. నాకు లవ్ స్టోరీస్ కంటే యాక్షన్, కమర్షియల్ ఎంటర్ టైనర్స్ ఇష్టం. అయితే మిథున్ ఈ కథ చెప్పినప్పుడు చాలా సందర్భాల్లో ఎమోషనల్ అయ్యాను. అట్లీ ఫస్ట్ మూవీ రాజా రాణి చూసినప్పుడు ఎలాంటి భావోద్వేగానికి గురయ్యానో డ్యూయెట్ కథ విన్నప్పుడు కూడా అలాంటి ఫీల్ కలిగింది. మధుర శ్రీధర్ గారు మాకు సపోర్ట్ గా ఉన్నారు. ఈ సినిమానే కాదు మా స్టూడియో గ్రీన్ సంస్థలో రాబోయో ప్రాజెక్ట్స్ కు కూడా ఆయన ఒక భాగంగా కొనసాగుతారు. రితిక యాక్టింగ్ బాగుంటుందని మా డైరెక్టర్ చెప్పారు. ఆమెకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. జీవీ ప్రకాష్ చెన్నైలో ఉండి రాలేకపోయాడు. నెక్ట్ ఈవెంట్ కు వస్తా అన్నాడు. ఇప్పటికే ఆయన మా మూవీకి రెండు సాంగ్స్ ఇచ్చాడు. వారం రోజుల్లో ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ చేస్తాం. డ్యూయెట్ సూపర్ హిట్ అవుతుందనే టీమ్ అంతా నమ్మకంగా ఉన్నాం." అన్నారు.
![]() |
![]() |