Home

»

Latest News

రజనీకాంత్‌ని విలన్ అంటున్న లోకేష్!

Nov 1, 2023 1:34PM

హిమాలయ శిఖరాల ఎత్తుని ఎలా అయితే కొలవలేమో సూపర్ స్టార్ రజనీ కాంత్ కి ఉన్న క్రేజ్ ని కూడా అలాగే కొలవలేము. సినిమాల్లో  రజనీ ప్రదర్శించే హీరోయిజానికి తమిళనాడు లోనే కాకుండా భారతదేశ వ్యాప్తంగా కూడా కోట్ల సంఖ్యలో అభిమానులు ఉన్నారు. అలాంటి రజనీని ఒక దర్శకుడు విలన్ ని  చేస్తానని అంటున్నాడు.

 రజనీకాంత్ ప్రస్తుతం జ్ఞానవేల్  దర్శకత్వం లో చేస్తున్న సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఆ సినిమా తర్వాత రజనీ ,లోకేష్ కనగ రాజ్ దర్శకత్వంలో ఒక సినిమా చెయ్యబోతున్నాడు. రజనీకాంత్  171 వ చిత్రంగా అఫీషియల్ గా అనౌన్సుమెంట్ కూడా వచ్చింది. ఆ సినిమా గురించి లోకేష్ మాట్లాడుతూ రజనీ గారిలోని విలనిజం నాకు ఇష్టమని విలనిజం పండించే విషయంలో ఆయన స్టైల్ నాకు చాలా బాగా నచ్చుతుందని మా కాంబినేషన్ లో వచ్చే సినిమా కోసం రజనీ గారి విలనిజాన్ని వాడుకోబోతున్నానని లోకేష్ చెప్పాడు. ఇప్పుడు లోకేష్ మాటలు వైరల్ అవుతున్నాయి. అలాగే తమ మూవీ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా ఉండబోదని కూడా లోకేష్ చెప్పడం ప్రాధాన్యతని సంతరించుకుంది.

                       
 తమిళ చిత్ర సీమలో కొత్త రకం స్క్రీన్ ప్లే తో ముందుకు దోసుపోతున్న దర్శకుడు లోకేష్ కనగ రాజ్. లోకేష్ ఇప్పుడు కేవలం తమిళ దర్శకుడే కాదు ఇండియన్ సినిమా దర్శకుడు కూడా. లోకేష్ లేటెస్ట్ గా విజయ్ తో లియో సినిమా తీసి హిట్ కొట్టాడు. ప్రస్తుతం రజనీకాంత్ తో  తెరకెక్కబోయే కొత్త చిత్రాన్ని సంబంధించిన  స్క్రిప్ట్ పనుల్లో లోకేష్ కనగ రాజ్ బిజీగా ఉన్నాడు. జైలర్ మూవీ ని నిర్మించిన సన్ పిక్చర్స్ సంస్థే ఇప్పుడు రజనీ లోకేష్ ల సినిమాని నిర్మించబోతుంది. అనిరుద్ సంగీత సారథ్యం వహిస్తున్నాడు. 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com