![]() |
![]() |
మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి మొదలైంది. వరుణ్‌తేజ్, లావణ్యత్రిపాఠిల పెళ్లి నవంబర్ 1న ఇటలీలో గ్రాండ్‌గా జరగనుంది. ఇప్పటికే రెండు కుటుంబాలకు చెందిన బంధుమిత్రులు ఇటలీ చేరుకున్నారు. నవంబర్ 5న హైదరాబాద్‌లో వరుణ్, లావణ్యల రెసెప్షన్ జరగనుంది.
ఇదిలా ఉండగా, నటి రేణు దేశాయ్ ఈ పెళ్ళి గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్‌గా మారాయి. తాను వరుణ్‌తేజ్ పెళ్లికి ఎందుకు వెళ్ళలేదు అనే విషయంపై ఆమె మాట్లాడింది. చాలా గ్యాప్ తర్వాత ‘టైగర్ నాగేశ్వరరావు’ చిత్రంలో రేణు దేశాయ్ ఓ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్‌లో భాగంగా ఈ కామెంట్స్ చేసింది. అయితే ఇది చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ పెళ్లికి వెళ్ళడం వల్ల తనను అక్కడ చూసి మెగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అసౌకర్యంగా ఫీల్ అవుతారని, అందుకే తాను పెళ్లికి వెళ్ళలేదని చెప్పింది. ఈ పెళ్లికే కాదు, గతంలో నిహారిక పెళ్లికి కూడా తాను వెళ్ళలేదని గుర్తుచేసింది రేణు. వరుణ్ తన కళ్లముందే పెరిగాడని, అతనికి తన ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని తెలిపింది రేణు.
![]() |
![]() |