![]() |
![]() |
.webp)
తెలుగు తమిళ భాషల్లో సమానంగా అభిమానులు కలిగిన నటుడు సూర్య. ఒకటి కాదు రెండు కాదు సుమారు పద్దెనిమిది సంవత్సరాల నుంచి సూర్య తెలుగు,తమిళ భాషల్లో సమానంగా అభిమానులని కలిగి ఉన్నాడు. రీసెంట్ గా ఆయన గతంలో నటించిన సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ అనే సినిమా తెలుగు నాట సెకండ్ రిలీజ్ అయితే థియేటర్స్ మొత్తం హౌస్ ఫుల్స్ అయ్యాయి. అలాగే ఆడ,మగ అనే తేడా లేకుండా అందరు స్క్రీన్ ముందుకు వెళ్లి డాన్సులు వేశారంటే సూర్య మీద ఉన్న అభిమానాన్ని అర్ధం చేసుకోవచ్చు. లేటెస్ట్ గా తన అభిమానులు అందరు సంతోషపడేలా సూర్య ఒక తీపి కబురుని చెప్పాడు.
సూర్య ప్రస్తుతం కంగువా అనే సినిమా తో బిజీ గా ఉన్నాడు. ఆ సినిమా తర్వాత తాను చెయ్యబోయే కొత్త సినిమా గురించి సూర్య తన ఎక్స్ వేదిక ప్రకటించాడు. సూర్య ప్రకటించిన ఆ సినిమా యొక్క కాంబో చూసి సూర్య ఫాన్స్ అప్పుడే ఫెస్టివల్ లాంటిది కూడా చేసుకుంటున్నారు. సూర్య తో ఆకాశమే నీ హద్దురా అనే సినిమా ని తెరకెక్కించిన సుధా కొంగర ఆ సినిమా కి దర్శకత్వం వహిస్తుండగా సూర్య సరసన నజ్రియా హీరోయిన్ గా చేస్తుంది. అలాగే మలయాళ సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. అలాగే బాలీవుడ్ ఫేమస్ విలన్ విజయ్ వర్మ విలన్ గా చేస్తున్నాడు.
ఇప్పుడు సూర్య ప్రకటించిన ఈ కాంబో దక్షిణ భారతీయ చిత్ర పరిశ్రమ లో సంచలనం సృష్టిస్తుంది. తమ అభిమాన కధానాయకుడు సూర్య ఈ సినిమా తో సరికొత్త రికార్డ్స్ సృష్టించడం ఖాయమని ఫాన్స్ అంటున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు జి.వి ప్రకాష్ కుమార్ కి ఈ సినిమా 100 వ సినిమా. 2d ఎంటర్ టైన్మెంట్ పతాకంపై జ్యోతిక, రాజశేఖర్ పాండియన్ లు ఈ సినిమా ని అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు. గజని సినిమా నుంచి సూర్య అంటే తెలుగు లో విపరీతమైన క్రేజ్. తెలుగు లో కొన్ని లక్షల మంది అభిమానులు సూర్య కి ఉన్నారు. సూపర్ స్టార్ రజనీ కాంత్ తర్వాత తెలుగులో సూర్య సినిమాలకి ఫుల్ డిమాండ్.
![]() |
![]() |