![]() |
![]() |

నార్త్ సినిమా పరిశ్రమలో హీరో ల ని అభిమానిస్తారు గాని మా హీరో గొప్పంటే మా హీరో గొప్పని ఒకరి మీద ఒకరు విమర్శలకి దిగడం జరగదు. కానీ సౌత్ చిత్రసీమలో మాత్రం మా హీరో గొప్పంటే మా హీరో గొప్పని తమ శక్తీ కొలది విమర్శలు చేసుకుంటూ తమ అభిమాన హీరో మీద తమకున్న అభిమానాన్ని కొలమానం చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు సౌత్ కి చెందిన అగ్ర హీరో కధానాయకుల ఫాన్స్ సోషల్ మీడియా వేదికగా హాష్ టాగ్స్ ఇచ్చుకుంటూ విమర్శలు చేసుకుంటున్నారు.
రజనీ అండ్ విజయ్ ఫాన్స్ మధ్య ఇప్పుడు కొత్త రకం యుద్ధం జరుగుతుంది. మా హీరో సినిమాకే
మొదటి వారం ఎక్కువ టికెట్స్ బుక్ అయ్యాయి లేదు మా హీరో సినిమాకే మొదటి వారం ఎక్కువ టికెట్స్ బుక్ అయ్యాయంటూ ఇద్దరి ఫాన్స్ వార్ కి దిగారు. రజనీ నటించిన జైలర్ మూవీ మొదటి వారం 6 లక్షల టికెట్స్ బుక్ అయ్యాయని రజనీ ఫాన్స్ అంటుంటే విజయ్ ఫాన్స్ మాత్రం మా విజయ్ సినిమా లియోకే మొదటి వారం 7 లక్షలు కి పైగా టికెట్స్ బుక్ అయ్యాయని అంటున్నారు. ఆ మాటలకి ఏకీభవించని రజనీ ఫాన్స్ విజయ్ ఫాన్స్ ని ఉద్దేశించి మొదటి వారం విజయ్ సినిమా 7 లక్షలకు పైగా టికెట్స్ బుక్ చేసుకొని ఉంటే మొదటి వారం కలెక్షన్ల పరంగా మరి మా రజనీ సినిమాని దాటాలి కదా అని అంటున్నారు. ఏది ఏమైనా ఇప్పుడు తమిళ సీమలో ఇప్పుడు ఈ మొదటి వారం టికెట్స్ బుకింగ్ విషయం లో రజనీ అండ్ విజయ్ ఫాన్స్ ల మధ్య రాజుకున్న గొడవ ఎటు వైపుకి దారి తీస్తుందో అని అందరు అనుకుంటున్నారు.
రజనీకాంత్, విజయ్ ఇద్దరు కూడా తమినాడు సినీ పరిశ్రమలో మోస్ట్ పవర్ ఫుల్ అగ్ర హీరోలు. ఇద్దరికీ కొన్ని లక్షల సంఖ్య లో అభిమానులు ఉన్నారు. ఆ ఇద్దరి సినిమా వచ్చిందంటే తమిళనాడు మొత్తం పండగ వాతావరణం నెలకొని ఉంటుంది. తాజగా కొన్ని నెలల గ్యాప్ లో రజనీ నటించిన జైలర్ మూవీ అలాగే రీసెంట్ గా విజయ్ నటించిన లియో మూవీ లు వచ్చాయి. రెండు కూడా మంచి టాక్ ని సొంతం చేసుకున్నాయి.
![]() |
![]() |