![]() |
![]() |

దళపతి విజయ్,లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో లేటెస్ట్ గా వచ్చి హిట్ కొట్టిన మూవీ లియో. సౌత్ లాంగ్వేజ్ లుతో పాటు హిందీ లాంగ్వేజ్ లో కూడా లియో రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని సాధించింది. అలాగే ఇతర దేశాల్లో కూడా లియో తన సత్తా ని చాటుతుంది. ఈ టైంలో తాజాగా లియో మూవీ కి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట హల్చల్ చేస్తుంది. ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఇదెక్కడి విడ్డురం అని అంటున్నారు.
లియో మూవీ అక్కడా ఇక్కడా అని తేడా లేకుండా ప్రపంచ వ్యాప్తంగా రికార్డు కలెక్షన్ల వైపు దూసుకు వెళ్తుంది. అమెరికా లో ఉన్న చాలా రాష్ట్రాల థియేటర్స్ లో లియో రిలీజ్ అయ్యింది. నేటికీ ఆల్ షోస్ హౌస్ ఫుల్స్ అవుతున్నాయి. ఇప్పుడు అమెరికాలోనే లియో సినిమా కి సంబంధించి ఒక సంఘటన జరిగింది. ఒక థియేటర్ లో లియో రన్ అవుతూ ఉంది. ప్రేక్షకులందరూ సినిమా చూడటంలో లీనమయిపోయారు. అంతలో ఒక వ్యక్తి హఠాత్తుగా స్క్రీన్ దగ్గరకి వెళ్లి స్క్రీన్ ని చించేసాడు. దీంతో ఒక్కసారిగా ప్రేక్షకులు షాక్ అయ్యారు.
ఆ తర్వాత ఎవరు ఎందుకు ఆ పని చేసారని వివరంగా ఆరా తీస్తే... స్క్రీన్ చించిన వ్యక్తి ఇప్పుడు లియో సినిమాని అమెరికా మొత్తం డిస్ట్రిబ్యూట్ చేసిన సంస్థ వల్ల గతంలో ఒక సారి నష్టపోయాడంట... తన నష్టం గురించి అడిగితే ఎవరు పట్టించుకోకపోయే సరికి లియో స్క్రీన్ ని చించేసాడనే విషయం అందరి తెలిసింది. ఈ విషయంలో అసలు కొసమెరుపు ఏంటంటే అతను సినిమా ఎగ్జిబిటర్ కూడాను. అంటే థియేటర్ ఓనర్. కాగా లియో మూవీ ఇప్పటివరకు 400 కోట్లు పైగా కలెక్షన్స్ వసులు చేసింది.
![]() |
![]() |