![]() |
![]() |

ఒకప్పుడు బుల్లితెరని రఫ్ఫాడించిన అనసూయ ఇప్పుడు తనదైన నటనతో వెండి తెరని కూడా రఫ్ఫాడిస్తుంది. అలాగే పాత్ర ఏదైనా కానీ ఆ పాత్రలో ఒదిగిపోయి నటించడం అనసూయ స్పెషాలిటీ. అలాగే సొసైటీ లో ఆడవాళ్ళని ఎవరైనా తక్కువ చేసి మాట్లాడినా అలాగే తప్పుగా మాట్లాడినా కూడా వెంటనే రెస్పాండ్ అయ్యి అలాంటి వాళ్ళ అంతు చూస్తుంది. తాజాగా విజయ దశమి రోజున అందరు పండగ హడావిడి లో ఉంటే తను మాత్రం అలుపంటూ ఎరుగని ఒక మిస్సైల్ లా తనకి సంబంధించిన పిక్స్ ని తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చెయ్యడమే కాకుండా కొన్ని వ్యాఖ్యలని కూడా పోస్ట్ చేసి తను ఎంత స్పెషలో చెప్పింది.
దసరా రోజున జిమ్ లో ఎక్సరసైజ్ చేస్తున్న తన పిక్స్ ని అనసూయ ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. అలాగే ఆ పిక్స్ కి నెగిటివ్ కామెంట్స్ వస్తాయని ఆమె ఎదుగుదలని కొంత మంది అసూయపరులు చూడలేరని ముందుగానే గ్రహించిన అనసూయ అందుకు తగ్గ విధంగా కొన్ని వ్యాఖ్యలు ని కూడా తన పిక్స్ కింద ప్రస్తావించింది. అలాగే స్త్రీ శక్తిని తెలుసుకొని స్త్రీ ని అవమానించే దుష్టశక్తుల మీద ఈ విజయ దశమి రోజున ప్రతి ఒక్క స్త్రీ ఒక్కో కాళికా మాతగా మారాలని చెప్పింది. ప్రస్తుతం అనసూయ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

రంగస్థలం లో రంగమ్మ అత్తగా,ఖిలాడీ లో చంద్రకళ ల పుష్ప లో మంగళం దాక్షాయణిలా ఇలా రకరకాల పాత్రల్లో సూపర్ గా నటించి తన కోసం దర్శకులు కొత్త పాత్రలు సృష్టించే రేంజ్ కి అనసూయ వెళ్ళింది. పుష్ప 2 తో పాటు చాల అప్ కమింగ్ ప్రాజెక్ట్ లు తన చేతుల్లో ఉన్నాయి. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో అనసూయ చాలా బిజీ ఆర్టిస్ట్. అనసూయ జిమ్ లో పడే కష్టమంతా తెలుగు సినీ ప్రేక్షకులని అలరించడం కోసమే.. ఎందుకంటే సినిమా రంగం లో మెప్పించాలంటే ప్రతి క్షణం కష్టపడాలసిందే.
![]() |
![]() |