![]() |
![]() |

తెలుగు చిత్రసీమ ఒకరి సొత్తు కాదు అందరిది అని నిరూపించిన నటుడు సంపూర్ణేష్ బాబు. ఈ మధ్యన సినిమా లు విషయం లో కొంచం డల్ అయినా ఇప్పుడు ఒక్కసారిగా వేగం పెంచాడు. లేటుగా అయిన లేటెస్టుగా వస్తాను అనే విధంగా కొత్త కొత్త కాన్సెప్టులతో సంపూ సినిమా లు చేస్తూ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతున్నాడు. ముఖ్యంగా కథ కి వేల్యూ ఉండే సినిమా లని ఎంచుకొని తన సత్తాని చాటడానికి సిద్ధం అవుతున్నాడు. మార్టిన్ లూథర్ కింగ్ తో అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంపూ ఇంకో వెరైటీ చిత్రంలో నటిస్తున్నాడు. తన కొత్త సినిమా కి సంబంధించిన క్రేజీ అప్ డేట్ ఫిలిం మార్కెట్లో సందడి చేస్తుంది.
అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో గతంలో ఎన్నో సినిమా లు వచ్చాయి. ఆ సినిమాలన్నీ కూడా సక్సెస్ సాధించినవే.ఇప్పుడు అదే ఫార్ములాతో సంపూర్ణేష్ బాబు, సంజోష్ హీరో లుగా మన్ మోహన్ మేనంపల్లి దర్శకత్వంలో సోదర అనే మూవీ రూపుదిద్దుకుంటుంది. క్యాన్స్ ఎంటర్టైన్మెంట్స్ మరియు మాంక్ ఫిలిమ్స్ పతాకంపై చంద్ర చగంలా నిర్మిస్తున్న సోదర చిత్రం నుంచి దసరా కానుకగా చిత్ర బృందం ఒక మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేసింది. ఆ మోషన్ పోస్టర్ లో సంపూర్ణేష్ బాబు అండ్ సంజోష్ లు కలిసి ఆప్యాయంగా ఉన్న పోస్టర్ అందరిని ఆకర్షిస్తుంది. అలాగే సినిమా మీద అంచనాలని కూడా పెంచింది. అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సోదర మూవీ గతంలో చిరంజీవి నటించిన అన్నయ్య మూవీ, నాగార్జున నటించిన సీతారామరాజు మూవీ ,పవన్ కళ్యాణ్ నటించిన తమ్ముడు మూవీ లు లాగానే విజయవంతమవుతుందని నిర్మాత చంద్ర చగంలా అన్నాడు. అలాగే సోదర సినిమా ఫస్ట్ లుక్ అక్టోబర్ 29న రిలీజ్ అవ్వబోతుంది. ప్రాచీబంసాల్, ఆరతి గుప్తా, హీరోయిన్ లుగా నటిస్తున్న ఈ చిత్రంలో బాబా భాస్కర్, బాబు మోహన్, గెటప్ శీను లు కూడా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సునీల్ కశ్య ప్ సంగీతాన్ని అందిస్తుండగా జాన్ కెమెరా బాధ్యతలని నిర్వహిస్తున్నాడు.
![]() |
![]() |