![]() |
![]() |

రెబల్ స్టార్ గా తెలుగునాట తిరుగులేని ఇమేజ్ ను సొంతం చేసుకున్న ప్రభాస్.. బాహుబలి తర్వాత గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు. ప్రపంచవ్యాప్తంగా అభిమానులకు సంపాదించుకున్న అతికొద్ది భారతీయ నటుల్లో ప్రభాస్ ఒకడు. ప్రభాస్ సినిమా విడుదలవుంతుందంటే వరల్డ్ వైడ్ గా సందడి కనిపిస్తుంది. సినిమాలకే కాదు.. ప్రభాస్ బర్త్ డే కి కూడా వరల్డ్ వైడ్ గా సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి.
అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు. తమ అభిమాన హీరో కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో సెలబ్రేషన్స్ ఉండటం సహజం. అయితే రాష్ట్రం కాని రాష్ట్రంలో, దేశం కాని దేశంలో.. ఇది అసలు జపానా? లేక భీమవరమా? అనుకునే రేంజ్ లో జపాన్ లో ప్రభాస్ బర్త్ డే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. బాహుబలి తర్వాత జపాన్ లో ప్రభాస్ క్రేజ్ ఎంతో పెరిగింది. ప్రభాస్ సినిమా వస్తుందంటే అక్కడ కూడా పండగ వాతావరణం కనిపిస్తుంది. ఇక ఇప్పుడు బర్త్ డే వేడుకలు కూడా కాస్త ముందుగానే ఘనంగా జరిగాయి. ప్రభాస్ సినిమాలలోని పోస్టర్స్ తో ఎంతో అందంగా డెకరేషన్ చేసి, జపాన్ అభిమానులు గ్రాండ్ గా ప్రభాస్ బర్త్ డే సెలబ్రేట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

![]() |
![]() |