![]() |
![]() |

నాచురల్ స్టార్ నాని బయట ఎంత నాచురల్ గా ఉంటాడో సినిమాలో కూడా అంతే నాచురల్ గా ఉంటాడు. అదేమి విచిత్రమో గాని సినిమాలో ఆయనకి అలాంటి పాత్రలే వస్తుంటాయి. సినిమాలో తాను ఎంత రఫ్ పాత్రలు పోషించినా కూడా ఆడియన్స్ దృష్టిలో ఆ పాత్రలన్నీ చాలా నాచురల్ గానే కనపడతాయి. తాజాగా సోషల్ మీడియాలో ఆయన తన సినిమాకి తీసుకుంటున్న రెమ్యునరేషన్ గురించి చర్చకు వచ్చింది. దాంతో వామ్మో నాని యాక్టింగ్ లో మాత్రమే నాచురల్ రెమ్యునరేషన్లో మాత్రం నాచురల్ కాదు కదా అని అనుకుంటున్నారు.
నాని...ఎవరి అండ దండలు లేకుండా అసిస్టెంట్ డైరెక్టర్ స్థాయి నుంచి హీరో గా ఎదిగిన ఒక సూపర్ హీరో. రైడ్ సినిమా నుంచి మొన్న వచ్చిన దసరా వరకు ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి తన కంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నాడు. నాని సినిమా రిలీజ్ అయిందంటే యూత్ మొత్తం ఎలా అయితే థియేటర్స్ ముందు క్యూ కడుతుందో ఫ్యామిలీ ఆడియన్స్ కూడా నాని సినిమా చూడటం కోసం థియేటర్స్ కి క్యూ కడుతుంది. తాజాగా డిసెంబర్ నెలలో హాయ్ నాన్న సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
ఇప్పుడు లేటెస్ట్గ్ గా నాని ఒక సినిమాకి తీసుకుంటున్న రెమ్యునరేషన్ గురించి చర్చకు వచ్చింది. నాని తన సినిమాకి అక్షరాలా 25 కోట్లు తీసుకుంటున్నాడు. నిర్మాతలు కూడా నాని అడిగినంత ఇవ్వడానికి వెనుకాడటం లేదు. ఎందుకంటే నాని సినిమా అంటే మినిమమ్ గ్యారంటీ తో పాటు నాన్ థియేట్రికల్ బిజినెస్ కూడా బాగా జరుగుతుంది. నానికి ఇచ్చే రెమ్యునరేషన్ మొత్తం నాన్ థియేట్రికల్ పరంగా వస్తుండం తో నిర్మాతలు నాని కి 25 కోట్లు ఇవ్వడానికి వెనకాడటం లేదు.
![]() |
![]() |