Home

»

Latest News

'భగవంత్ కేసరి'లో రెండో గెటప్ ఇదే.. ఆ 15 నిమిషాలు ఫ్యాన్స్ కి పండగే!

Oct 17, 2023 11:23AM

నటసింహం నందమూరి బాలకృష్ణ టైటిల్ రోల్ లో అనిల్ రావిపూడి డైరెక్షన్ లో రూపొందిన సినిమా 'భగవంత్ కేసరి'. షైన్ స్క్రీన్స్ నిర్మించిన ఈ మూవీలో శ్రీలీల, కాజల్ అగర్వాల్, అర్జున్ రామ్ పాల్ ముఖ్య పాత్రలు పోషించారు. దసరా కానుకగా అక్టోబర్ 19న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. 'భగవంత్ కేసరి'పై భారీ అంచనాలు ఉన్నాయి. టీజర్, ట్రైలర్ ఆ అంచనాలను పెంచేశాయి. అయితే టీజర్, ట్రైలర్ లో చూపించని ఎన్నో సర్ ప్రైజ్ లు సినిమాలో ఉన్నాయని.. ముఖ్యంగా బాలయ్య రెండో గెటప్ అదిరిపోతుందని మూవీ టీం చెబుతోంది. అయితే ఆ గెటప్ ఏంటనేది మాత్రం రివీల్ చేయడంలేదు.

'భగవంత్ కేసరి' ప్రచార చిత్రాల్లో బాలయ్య గెటప్ పవర్ ఫుల్ గా ఆకట్టుకుంటుంది. అయితే రెండో గెటప్ మరింత పవర్ ఫుల్ గా ఉంటుందని అంటున్నారు. రెండో గెటప్ లో బాలకృష్ణ పవర్ ఫుల్ పోలీస్ గా కనిపించనున్నారని తెలుస్తోంది. దాదాపు 15 నిమిషాల పాటు బాలయ్య పోలీస్ గా సందడి చేయనున్నారని సమాచారం. బాలయ్య పోలీస్ గా కనిపించే సన్నివేశాలు అద్భుతంగా వచ్చాయని, ఆ ఎపిసోడ్ సినిమాకే హైలైట్ గా నిలవనుందని చెబుతున్నారు. మామూలుగానే పోలీస్ రోల్స్ లో బాలయ్య విజృంభిస్తాడు. 'రౌడీ ఇన్‌స్పెక్టర్', 'లక్ష్మీనరసింహ' వంటి సినిమాల్లో పోలీస్ గా ఆయన స్క్రీన్ ప్రజెన్స్ కి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇప్పుడు 'భగవంత్ కేసరి'తో మరోసారి ఆ మ్యాజిక్ రిపీట్ కానుందని చెబుతున్నారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com