Home

»

Latest News

సుహాసినిని ఇబ్బంది పెట్టిన ఐస్‌క్రీమ్‌... కొరియోగ్రాఫర్‌ సీరియస్‌!

Oct 16, 2023 6:39PM

ఇప్పుడు ఒక స్థాయిలో వున్న నటీనటులు కెరీర్‌ ప్రారంభంలో ఎన్నో ఇబ్బందులు పడినవారే. అయితే హీరోలకు పడిన ఇబ్బందులు ఒక రకమైతే, హీరోయిన్లు పడే ఇబ్బందులు నానా రకాలు. ముఖ్యంగా ఇప్పుడు క్యాస్టింగ్‌ కౌచ్‌ అని చెప్పుకుంటున్న ఇబ్బందులు ఆరోజుల్లో కూడా వున్నాయి. సోషల్‌ మీడియా ఇప్పుడు బాగా అందుబాటులోకి వచ్చింది కాబట్టి ఇలాంటి విషయాల్ని బహిర్గతం చేయడానికి హీరోయిన్లు వెనకాడడం లేదు. 

ఇలాంటి ఓ ఘటన ఒకప్పటి హీరోయిన్‌ సుహాసినికి ఎదురైంది. మంచి సినిమా బ్యాక్‌గ్రౌండ్‌ ఉన్న సుహాసినికి కూడా ఇబ్బందులు తప్పలేదు అంటే మరి ఏ సపోర్ట్‌ లేని హీరోయిన్ల సంగతి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. తనకు ఎదురైన ఆ ఘటన గురించి సుహాసిని మాట్లాడుతూ ‘హీరోయిన్‌గా నేను నటించిన సినిమాల్లో గ్లామర్‌ షో చెయ్యాల్సి వచ్చినపుడు చాలా ఇబ్బంది పడేదాన్ని. అలాగే కొన్ని అసభ్యకరమైన సీన్స్‌ చెయ్యనని ఖచ్చితంగా చెప్పేసేదాన్ని. ఒక సినిమాలో హీరో ఒడిలో కూర్చోవాలని చెప్పారు. పరాయి వ్యక్తి ఒడిలో నేను కూర్చోవడం ఏమిటి అని ఆ సీన్‌ చెయ్యడానికి నేను ఒప్పుకోలేదు. అదే సినిమాలో హీరోతో కలిసి ఐస్‌క్రీమ్‌ తినే సీన్‌లో హీరో తిన్న ఐస్‌క్రీమ్‌నే నేను తినాలని చెప్పారు. ఒకరు తిన్న ఐస్‌క్రీమ్‌ను నేను తినడం ఏమిటి అని గట్టిగా అడిగాను. దానికి కొరియోగ్రాఫర్‌ నాపై సీరియస్‌ అయ్యాడు. తాను చెప్పిన విధంగానే చెయ్యాలని అన్నాడు. అయినా ఆ సీన్‌ నేను చెయ్యను అని చెప్పాను. చెయ్యలేదు కూడా’ అంటూ ఆ ఘటనను గుర్తు చేసుకున్నారు సుహాసిని. 
 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com