![]() |
![]() |
ఎ.పి. సి.ఎం. జగన్‌మోహన్‌రెడ్డి ఇటీవల హీరో పవన్‌కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలను నిర్మాత, నటుడు బండ్ల గణేష్ ఖండిరచారు. ఈ మేరకు శుక్రవారం ఒక వీడియోను విడుదల చేశారు గణేష్. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సందర్భంగా బహిరంగ సభలో వై.ఎస్.జగన్ మాటలను మరోసారి గుర్తు చేశారు. ‘‘దత్తపుత్రుడి ఇల్లేమో హైదరాబాద్, ఇల్లాలేమో ఒకసారి లోకల్, మరోసారి నేషనల్, ఇంకోసారి ఇంటర్నేషనల్.. ఆ తర్వాత ఏంటో నాకు తెలీదు. ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి ఇలా మారుస్తూ ఉంటాడు’’ అని జగన్ అన్న మాటలకు పైవిధంగా స్పందించారు.
బండ్ల గణేష్ విడుదల చేసిన వీడియోలో మాట్లాడుతూ ‘‘నిన్నటి నుంచి నా మనసులో ఒకటే వేదన, బాధ. నాకెంతో ఇష్టమైన, దైవ సమానుడైన పవన్ కల్యాణ్ గురించి జగన్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. జగన్.. మీరు మంచి హోదాలో ఉన్నారు. ఎన్నో ఏళ్ళుగా పవన్ కల్యాణ్‌గారితో జర్నీ చేస్తున్న వ్యక్తిగా చెబుతున్నా. పవన్ కల్యాణ్ నిజాయితీ పరుడు, నీతివంతుడు, భోళా మనిషి. ఎవరు కష్టాల్లో ఉన్నా ఆ కష్టం తనదిగా భావించి సహాయం చేస్తారు. ప్రతి వ్యక్తి జీవితంలో కొన్ని చెడు సంఘటనలు జరుగుతాయి. పవన్‌గారి జీవితంలో కూడా ఆయన ప్రమేయం లేకుండా కొన్ని జరిగాయి. పవన్‌గారిని విమర్శించటానికి ఏమీ లేక ఆయన వ్యక్తిగత విషయాలను పదే పదే మాట్లాడుతున్నారు. మీ వేదికలకు, ఆయన వ్యక్తిగత జీవితానికి ఎలాంటి సంబంధం లేదు. ఆయన్ని ఎత్తి చూపడానికి ఏ కారణం లేక పదేపదే మీరు అతని వ్యక్తిగత జీవితాన్ని ప్రస్తావించడం కరెక్ట్ కాదని విన్నవిస్తున్నా. పవన్ కల్యాణ్ సమాజానికి ఉపయోగపడే మనిషి. ఆయన సమాజం కోసం బతుకుతున్న వ్యక్తి. హీరోగా కంఫర్టబుల్‌గా ఉన్న లైఫ్‌ను వదులుకొని నిస్వార్థంగా ప్రజలకు మంచి చేయాలనే తపనతో పార్టీ నడుపుతున్నారు. జనం బాగుండాలని రాత్రింబవళ్లు కష్టపడుతున్నాడు. సినిమాలు చేసి సంపాదించిన సొమ్ముతో పార్టీ కోసం ఖర్చు చేసుకుంటున్నాడు. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకుంటున్నారు. ఎవరి దగ్గర ఏదీ ఆశించకుండా పార్టీ నడుపుతున్నాడు. ఆయనకు లేనిది ఒకటే.. కులాభిమానం. మనం భారతీయులం అంటాడాయన. ఆయనకు కుల పిచ్చి ఉంటే నన్ను ఇంత పెద్ద నిర్మాతను చేసేవాడా? ఈరోజు నేను అనుభవిస్తున్న స్టేటస్ మొత్తం పవనకల్యాణ్ పెట్టిన భిక్షే. తెలిసీ తెలియకుండా పవనకల్యాణ్‌లాంటి మహానుభావుడిపై అభాండాలు వేయకండి. ఈ సమయంలో కూడా నేను మాట్లాడకపోతే నా బతుకు ఎందుకు అనిపిస్తుంది. అందుకే ఈ వీడియో రిలీజ్ చేస్తున్నా’’ అని బండ్ల గణేష్ పేర్కొన్నారు.
![]() |
![]() |