![]() |
![]() |

ఇళయ దళపతి విజయ్ నుంచి వస్తున్న తాజా మూవీ లియో ఈ నెల 19 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా లియో ఫోబియా నడుస్తుంది. లోకేష్ కనగ రాజ్ దర్శకత్వం లో వస్తున్న ఈ మూవీ కోసం విజయ్ ఫాన్స్ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారో సినీ ప్రేక్షకులు కూడా అంతే ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. కానీ ఇప్పుడు ఈ మూవీ ప్రదర్శనకి సంబంధించి ఒక ఏరియా లో షో క్యాన్సిల్ అవ్వడం సంచలనం సృష్టిస్తుంది.
ఒక్కో సినిమా లో ఒక్కో విధంగా తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించడం విజయ్ స్టైల్. ఇందుకు ఆయన సినీ కెరీరే ఒక ఉదాహరణ. విజయ్ నుంచి లేటెస్ట్ గా లియో మూవీ రాబోతుంది. తెలుగు తమిళ ,మలయాళ భాషలతో పాటు హిందీ భాషలో కూడా లియో విడుదల కాబోతుంది. లియో సినిమాకి సంబంధించి ఒక రికార్డు కూడా ఇటీవలే నమోదు అయ్యింది. ఆర్ఆర్ఆర్ సినిమా యు ఎస్ లో ఎన్ని థియేటర్స్ లో రిలీజ్ అయ్యిందో అంత కంటే ఎక్కువ థియేటర్లలో లియో సినిమా విడుదల కాబోతుందనే వార్తలతో విజయ్ ఫాన్స్ పండగ చేసుకున్నారు.
కానీ ఇప్పుడు యుఎస్ లో విజయ్ సినిమా రిలీజ్ కావటం లేదు. ఒక్కసారిగా ఈ వార్త తో యుఎస్ లో ఉన్న విజయ్ అభిమానులు షాక్ కి గురయ్యారు. తమ అభిమాన కధానాయకుడు నటించిన సినిమా చూడాలని ముందుగానే టికెట్స్ బుక్ చేసుకున్న అభిమానులు ఇప్పుడు ఆ వార్తతో షాక్ అయ్యారు.
లియో మూవీ ఎందుకు క్యాన్సిల్ అయ్యిందో అనే వివరణ బయటకి వచ్చింది. యూఎస్ లో ప్రదర్శించే ఈ చిత్రం యొక్క ఐమ్యాక్స్ వెర్షన్ కంటెంట్ ఇంకా పూర్తిగా రెడీ అవ్వలేదంట.దాంతో ఐమ్యాక్స్ వెర్షన్ ప్రింట్ వెళ్ళలేదు. టికెట్స్ బుక్ చేసుకున్న వారికి రిటర్న్ అమౌంట్ ఇస్తున్నారు.
![]() |
![]() |